TS Inter Supplementary Results 2023 link : ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. ఈ సారి ఫలితాలను..
2023 మే నెలలో వెల్లడించిన ఇంటర్ ఫలితాల్లో ద్వితీయ సంవత్సరంలో 1.50 లక్షల మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. వీళ్లంతా ఫెయిలైన సబ్జె క్టుకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రాశారు. ఫెయిలైన వారితోపాటు మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్ రాశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను www.sakshieducation.comలో చూడొచ్చు.
How to check TS Inter 1st year Advanced Supplementary Results 2023 :
➤ Visit https://sakshieducation.com or https://results.sakshieducation.com
➤ Click on TS Inter 1st Year Advanced Supply Results 2023 link available on the home page
➤ Enter your hall ticket number and click on submit button
➤ Your results will be displayed along with rank
➤ Download and save a copy for further reference
చదవండి: Best Non-Engineering Courses After Inter: ఇంజనీరింగ్‌తోపాటు అనేక వినూత్న కోర్సులు !!
How to check TS Inter 2nd year Advanced Supplementary Results 2023 :
➤ Visit https://sakshieducation.com or https://results.sakshieducation.com
➤ Click on TS Inter 2nd Year Advanced Supply Results 2023 link available on the home page
➤ Enter your hall ticket number and click on submit button
➤ Your results will be displayed along with rank
➤ Download and save a copy for further reference
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4,12,325 మంది విద్యార్థులు ఈ పరీక్షలను రాశారు. ఇందులో ఫస్టియర్‌కి 2,70,583 మంది, సెకండియర్‌కి 1,41,742 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.రెండేళ్లకు కలిపి 10 లక్షల పేపర్లకు మూల్యాంకనం నిర్వహించారు.
ఈ కారణంతోనే త్వరగా ఫలితాలు విడుదల..
ఇంటర్ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెల్లడయితే తప్ప, విద్యార్థులు డిగ్రీ సీట్లకు నిర్వహించే దోస్త్, ఇంజనీరింగ్‌కు నిర్వహించే ఎంసెట్‌లో పాల్గొనే వీలుండదు. ఇప్పటికే దోస్త్ రెండు దశలు పూర్తయింది. ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో త్వరగా ఫలితాలు వెల్లడించాలని సన్నాహాలు చేస్తున్నామని ఇంటర్ పరీక్షల విభాగం అధికారి జయప్రదాభాయ్ తెలిపారు.
ఈ ఏడాది జరిగిన ఇంటర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.85 శాతం ఉత్తీర్ణత, సెకండియర్ 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఫస్టియర్‌లో బాలురు 54.66 శాతం పాసయితే, బాలికలు 68.68% ఉత్తీర్ణులయ్యారు. అలాగే సెకండియర్‌లో బాలురు 55.60% ఉత్తీర్ణులైతే, బాలికలు 71.57 శాతం పాస్ కావడం గమనార్హం. ఇంటర్ రెగ్యులర్ పరీక్షలకు ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తంగా 9,48,153 మంది హాజరయ్యారు.