TS Inter Results 2022: ఇంటర్ ఫలితాల్లో అవిభక్త కవలలు వీణ-వాణి ఫస్ట్‌క్లాస్‌లో పాస్.. వీరికి ఎన్ని మార్కులు వచ్చాయంటే..?
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను జూన్ 28వ తేదీన విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణ-వాణీలు ఫస్ట్‌క్లాస్‌లో పాస్ అయ్యరు.
వీణకు 712 మార్కులు, వాణి 707 మార్కులతో ఫస్ట్ క్లాస్ సాధించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ వీణ, వాణిలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వీరి భవిష్యత్‌కు అవసరమైన అన్ని సదుపాయాలతో పాటు, వారి కలలను సాకారం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు వీణ-వాణిలకు సహకారం అందించిన అధికారులకు అభినందనలు తెలిపారు.
Published date : 28 Jun 2022 07:38PM