Skip to main content

TSBIE: ఇంటర్‌ బోర్డ్‌లో జేడీపై వేటు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మిడియెట్‌ బోర్డ్‌లో ప్రక్షాళన పర్వం వేగం పుంజుకుంది. ఆరోపణలు, ప్రైవేటు కాలేజీలతో ఆర్థిక సంబంధాలున్న అధికారులను కీలక బాధ్యతల నుంచి తప్పిస్తున్నారు.
TSBIE
ఇంటర్‌ బోర్డ్‌లో జేడీపై వేటు

ఇంటర్‌ వార్షిక పరీక్షలు దగ్గరకొస్తున్న నేపథ్యంలో ఈసారి ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగా కీలకమైన బాధ్యతల్లో ఉన్న ప్రాంతీయ సంచాలకులుగా ఉన్న రాణిని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ తెలంగాణ ఇంటర్‌ విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ బాధ్యతలను మరో జేడీ జయప్రదాబాయికి అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.

చదవండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!

ఇంటర్‌ బోర్డ్‌ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం అవినీతి ఆరోపణలకు పాల్పడినట్టు ఫిర్యాదు అందడంతోనే ఆమెను బాధ్యతల నుంచి తప్పించినట్టు తెలిసింది. నల్లగొండ జిల్లాకు చెందిన జూనియర్‌ లెక్చరర్స్‌పై ఇటీవల కొన్ని ఫిర్యాదులొచ్చాయి. దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా, వారి నుంచి డబ్బులు ఆశించినట్టు జేడీపై ఫిర్యాదు రావడంతో, దీనిపై మిత్తల్‌ విచారణ జరిపినట్టు తెలిసింది. ఇవి నిజమని తేలడంతో బాధ్యతల నుంచి తప్పించారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. 

చదవండి: After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్‌ కొలువు

Published date : 14 Feb 2023 03:06PM

Photo Stories