TS Inter Advanced Supplementray Results: ఈనెల 25న తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈనెల 25న విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఫలితాల విడుదల తర్వాత దోస్త్ ద్వారా డిగ్రీలో ప్రవేశానికి మరో దఫా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు రెండు సంవత్సరాలకు కలిపి 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు, ఫస్టియర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం రాసిన వారు ఈ జాబితాలో ఉన్నారు.
మొత్తం 11 లక్షల సమాధాన పత్రాలను కొన్ని రోజులుగా మూల్యాంకనం చేశారు. గత పరీక్షల్లో తప్పులు దొర్లిన నేపథ్యంలో మరి న్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. సాంకేతిక లోపాలను, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. డీకోడింగ్, ఆన్‌లైన్‌లో మార్కులు పొందుపర్చే కార్యక్రమం పూర్తయింది. అయితే, ఉన్నతాధికారి ఒకరికి మంగళవారం సెంటిమెంట్ ఉండటంతో 25వ తేదీన ఒప్పుకుంటారా అనే సందేహం అధికారుల్లో ఉంది.
గత పరీక్ష ఫలితాల విషయంలోనూ ఉన్నతాధికారి మంగళవారం సెంటిమెంట్ ముందుకు తేవడంతో అంతా సిద్ధం చేసినా ఫలితాల వెల్లడిని వాయిదా వేశారు. ఈసారి కూడా అలాంటి అడ్డంకి ఉంటే 26 లేదా 27న విడుదల చేసే వీలుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది.
Tags
- Supplementary Exams
- Advanced Supplementary
- Inter Advanced Supplementary
- Inter Advanced Supplementary Results
- inter advanced supplementary results 2024
- Inter Advanced Supplementary Results
- Inter Board preparations
- Dost counseling
- Degree Admissions
- Inter-advanced examinations
- Failed inter exams
- Faster improvement
- sakshieducationlatest news