Skip to main content

Tenth & Inter: పరీక్ష రుసుము చెల్లింపు గడువు ఇదే..

తెలంగాణ ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ వార్షిక పరీక్షలను సెప్టెంబర్‌/ అక్టోబర్‌లో నిర్వహించనున్నట్లు ఓపెన్‌ స్కూల్‌ డైరెక్టర్‌ పీవీ శ్రీహరి ఆగస్టు 5న ఒక ప్రకటనలో తెలిపారు.
Tenth & Inter
తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష రుసుము

అభ్యర్థులు పరీక్ష రుసుమును ఆగస్టు 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని సూచించారు. రూ.25 అపరాధ రుసుముతో ఆగస్టు 23 నుంచి 29వ తేదీ వరకు, రూ.50 అపరాధ రుసుముతో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు చెల్లించవచ్చని వివరించారు. రుసుమును ఆన్‌లైన్‌ పద్ధతిలో మీసేవా లేదా టీఎస్‌ ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే చెల్లించాలని, చలానా, డీడీలను అనుమతించరని ఆయన స్పష్టం చేశారు. 

చదవండి: 

Published date : 06 Aug 2022 01:08PM

Photo Stories