జూనియర్ కాలేజీల బంద్.. ఆలోచనలో ప్రభుత్వం..
అయితే ఈ పరీక్ష ఫలితాలలో కేవలం 49 శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మిగతా 51 శాతం విద్యార్థులు తక్కువ మార్కులతో ఫెయిల్ అయ్యారు. దీంతో 2018 పరీక్ష ఫలితాలు తరహాలోనే ఇంటర్ బోర్డు పై.. ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది.
అటు ఫెయిల్ కావడంతో చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు తీర్పుకు వ్యతిరేకంగా డిసెంబర్ 20వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కాలేజీల బంద్ కు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్ఓలు పిలుపునిచ్చింది. విద్యార్థుల ప్రాణాలకు బాధ్యులైన తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డు తీర్పుకు నిరసనగా ఈ బందులు విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. మరో వైపు విద్యార్థుల నుండి వ్యతిరేకత రావడంతో ఫెయిల్ అయిన విద్యార్థులను మినిమం పాస్ మార్కులతో ఉత్తీర్ణులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
చదవండి:
TSBIE: కాలేజీకి హాజరవకుండా పరీక్షలు రాయొచ్చు
Education: కేరళను అధిగమించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
KCR: కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగుల విభజన.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు అయితే వారికి ఈ అవకాశం..