TSBIE: కాలేజీకి హాజరవకుండా పరీక్షలు రాయొచ్చు
Sakshi Education
కళాశాలకు వెళ్లకుండానే వచ్చే మార్చిలో ఆర్ట్స్, హ్యుమానిటీస్ కాంబినేషన్ తో పరీక్షలు రాసే అవకాశాన్ని కలి్పస్తున్నట్టు తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ డిసెంబర్ 19న ఒక ప్రకటనలో తెలిపారు.
హాజరు నుంచి మినహాయిం పు కోసం జనవరి 5వ తేదీలోగా రూ.500 చెల్లించా లని పేర్కొన్నారు. రూ.200 ఆలస్య రుసుముతో జనవరి 18లోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎస్సెస్సీ తత్సమానమైన పరీక్ష పాసై ఏడాది గడచిన వారు ఫస్టియర్‌కు, రెండేళ్ల వ్యవధి ఉన్నవారు ప్రథమ, ద్వితీయ పరీక్షకు హాజ రుకావచ్చని తెలిపారు. ఇంటర్ సైన్స్ గ్రూపు ఫెయి లైన వారు తమ ఐచ్ఛిక సబ్జెక్టులను సైన్స్ నుంచి ఆర్ట్స్, హ్యుమానిటీస్‌కు మార్చుకోవచ్చని, రెండేళ్ల ఇంటర్ పాసైనవారు సెకెండ్ లాంగ్వేజ్ కోసం అదనపు సబ్జెక్టుగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
చదవండి:
కన్వీనర్ కోటాకు జై.. 73 శాతం చేరికలు
బాలశ్రీ అవార్డులు ప్రదానోత్సవం
Education: కేరళను అధిగమించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం
Published date : 20 Dec 2021 02:39PM