TSBIE: ఇంటర్ ఫలితాల సమాచారం
మార్చి 15 నుంచి మొదలైన ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీతో ముగియనున్నాయి. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలన్నీ ఇప్పటికే పూర్తికాగా, 4న మాడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షలు మాత్రమే జరగనున్నాయి. ఏప్రిల్ నెలాఖరులోగా ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమాధానపత్రాల మూల్యాంకన ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలోని పాత ఉమ్మడి జిల్లాల్లో ప్రతీ చోట మూల్యాంకన ఏర్పాటు చేశారు. మూల్యాంకనకు నైపుణ్యం గల అధ్యాపకుల ఎంపిక కూడా జరిగింది. ముందుగా పరీక్షలు జరిగిన పేపర్లకు మూల్యాంకన మొదలుపెట్టినట్టు అధికారులు చెబుతున్నారు. మొదటి, రెండో ఏడాదికి కలిపి మొత్తం 9.6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. తొలుత 35 లక్షల సమాధానపత్రాలను ఆన్‌లైన్ విధానంలో మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించారు.
చదవండి: Career Guidance: మూడేళ్ల డిగ్రీ.. ఎలా ముందుకుసాగాలో తెలుసుకుందాం..
విద్యార్థుల సమాధానపత్రాలను స్కాన్ చేసి, వెబ్‌సైట్‌లో ఉంచి, అవసరమైన అధ్యాపకులు లాగిన్ అయి, మూల్యాంకన చేపట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, ఈలోగా పబ్లిక్ సర్విస్ కమిషన్ పేపర్ లీక్, కొన్ని నెలల క్రితం ఇంటర్ బోర్డ్ సీసీ కెమెరాల డేటా టాంపర్ అవడంతో అధికారులు కాస్తా వెనుకడుగు వేశారు. ఈసారి ఆఫ్‌లైన్ ద్వారానే మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ రెండోవారం ముగుస్తుందని భావిస్తున్నారు.
చదవండి: Dual Degree Courses After Inter: డ్యూయల్ డిగ్రీతో.. యూజీ + పీజీ!
ఆ తర్వాత వారం రోజుల్లో మార్కుల క్రోడీకరణ పూర్తి చేసి, ఒకటి రెండు రోజులు ట్రయల్‌రన్ వేయాలని నిర్ణయించారు. అంతిమంగా ఏప్రిల్ 30 నాటికి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేసే యోచనలో బోర్డ్ అధికారులున్నారు. దీనివల్ల ఎంసెట్‌కు వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది ఉండదని, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీని వెంటనే నిర్వహించడం సాధ్యమని భావిస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరుకు వీలు కాని పక్షంలో మే తొలి వారంలో ఫలితాల విడుదలవుతాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
చదవండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!