Skip to main content

TSBIE: నోటిఫికేషన్‌ తర్వాతే ఇంటర్‌ అడ్మిషన్లు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ బోర్డ్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాతే ఇంటర్‌ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలని బోర్డ్‌ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ స్పష్టం చేశారు.
TSBIE
నోటిఫికేషన్‌ తర్వాతే ఇంటర్‌ అడ్మిషన్లు

ఇందుకు విరుద్ధంగా ఏ ప్రైవేటు కాలేజీ అడ్మిషన్లు తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలోనే నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. ఇంటర్‌ రిజల్ట్స్‌ నేపథ్యంలో మిత్తల్‌ మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఇంటర్‌ ఫలితాలపై పత్రికా ప్రకటన ఇచ్చే ముందు కాలేజీలు విధిగా బోర్డ్‌ అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. వాళ్ళు దరఖాస్తు చేసిన రోజే పరిశీలించి అనుమతి ఇచ్చేందుకు యంత్రాంగం ఏర్పాటు చేశామన్నారు.

చదవండి: Admissions: ఒక్క రూపాయి కట్టకుండానే బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేయాలనుకుంటున్నారా... అయితే ఈ వార్త మీకోసమే...

విద్యార్థి తమ కాలేజీలో చదివి ఉంటే మాత్రమే దాన్ని ప్రకటించుకోవాలని, వేరే చోట చదివితే, దాన్ని ప్రచారం కోసం వాడుకుంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అనుబంధ గుర్తింపు ప్రక్రియ చాలా వరకూ పూర్తయిందని, ప్రభుత్వ కాలేజీలకు అఫ్లియేషన్‌ ఇచ్చామని తెలిపారు. అఫ్లియేషన్‌ లేని కాలేజీల వివరాలు తెలుసుకున్న తర్వాతే విద్యార్థులను ప్రైవేటు కాలేజీల్లో చేర్చాలని ఆయన సూచించారు. 

చదవండి: Telangana మైనారిటీ పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రవేశాలు

Published date : 10 May 2023 03:53PM

Photo Stories