Skip to main content

Intermediate: విద్యార్థుల ఆందోళనబాట.. సర్కారుకు సిఫార్సు చేసిన బోర్డు అధికారులు

ఇంటర్‌ బోర్డు దోబూచులాట రానురానూ వివాదాస్పదమవుతోంది. ఫస్టియర్‌లో ఫెయిలైన విద్యార్థుల పట్ల స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
Intermediate
విద్యార్థుల ఆందోళనబాట.. సర్కారుకు సిఫార్సు చేసిన బోర్డు అధికారులు

కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ దరఖాస్తులను ఎప్పుడు పరిశీలిస్తారు, నిర్ణయం ఎప్పుడు వెల్లడిస్తారో కూడా స్పష్టతనివ్వక పోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. సమ స్యపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్, రెండో సంవత్సరానికి సమర్థతను బేరీజు వేసుకోవ డానికే పరీక్షలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరస్ప రం విరుద్ధ ప్రకటనలు చేయ డంతో ఫెయిలైన విద్యార్థుల విషయంలో బోర్డు నిర్ణయమేంటని అయోమయం పెరుగుతోంది. అందరినీ పాస్‌ చేయాలని తాము ప్రభుత్వానికి సిఫార్సు చేశామని, గ్రీన్ సిగ్నల్‌రావాల్సి ఉందని బోర్డు అధికారులు చెబుతున్నారు. నిర్ణయం తీసుకోవడం జాప్యమవు తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే నలుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అందరినీ పాస్‌ చేయాలని రోజూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

ఇప్పటికే 39 వేల రీ వెరిఫికేషన్ దరఖాస్తులు

ఇటీవలి ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో దాదాపు 2 లక్షల మందికిపైగా ఫెయిల్‌ అయ్యారు. వీరిలో 39,039 మంది రీ వెరిఫికేషన్ కోసం.. 4,200 మంది రీ కౌంటింగ్‌ కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. రీ వెరిఫికేషన్ దరఖాస్తుదారులకు వారి జవాబు పత్రం ప్రతిని ఇంటికి పంపుతారు. రీ కౌంటింగ్‌ అయితే మార్కులను మరోసారి లెక్కి స్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా అధ్యాప కులను నియమించాలి. కానీ ఇంకా ఈ దిశగా పని మొదలుకాలేదు. అందరినీ పాస్‌ చేయాలనే డిమాండ్‌ వస్తుండటంతోనే జాప్యం జరుగుతోందని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఫస్టియర్‌పై నిర్ణయం రాకపోవడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. దీన్ని తీవ్రం చేసేందుకూ వ్యూహాలు రచిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో మారుమూల ప్రాంతాలకు ఆన్ లైన్ విద్య అందలేదని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదవర్గాలకు చెందినవారే ఎక్కువ మంది ఫెయిలయ్యారని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. దీంతో అలందరినీ పాస్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

చదవండి: 

Vinod Kumar: ఇంటర్‌ విద్యార్థులకు న్యాయం చేస్తాం

Intermediate: ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలి

TSBIE: కాలేజీకి హాజరవకుండా పరీక్షలు రాయొచ్చు

Published date : 24 Dec 2021 01:12PM

Photo Stories