Skip to main content

Vinod Kumar: ఇంటర్‌ విద్యార్థులకు న్యాయం చేస్తాం

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యా ర్థుల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుందని, త్వరలోనే సానుకూల నిర్ణయం ప్రకటిస్తుందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.
Vinod Kumar
ఇంటర్‌ విద్యార్థులకు న్యాయం చేస్తాం

నేషనల్‌ ఇండిపెండెన్స్ స్కూల్స్‌ అలయెన్స్ (నిసా), తెలంగాణ రిజిస్టర్డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్ (ట్రాస్మా) ఇటీవల కరోనా కాలంలో విద్యా ప్రమాణాలపై నిర్వహించిన సర్వే నివేదికను వినోద్‌ డిసెంబర్‌ 21న హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించినా గ్రామీణ ప్రాంతాలకు విద్య చేరువ కాలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాకాలంలో గత రెండేళ్లుగా విద్యారంగానికి జరిగిన నష్టాన్ని ఉపాధ్యాయులు పూడ్చాలని, బ్రిడ్జ్‌ కోర్సు అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అన్ని స్థాయిల్లోనూ విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలనే ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ట్రాస్మా సలహాదారు డాక్టర్‌ ప్రసాదరావు మాట్లాడుతూ 98 శాతం గ్రామీణ విద్యార్థులు ఆన్ లైన్ విద్యపై మక్కువ చూపడం లేదన్నారు. కరోనా మూలంగా విద్యార్థులకు ఆంగ్ల భాష మీద పట్టు తగ్గిందని, రాత నైపుణ్యానికి దూరమయ్యారని, ఈ నష్టాన్ని పూడ్చకపోతే భవిష్యత్‌లో విద్యారంగం అనేక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ట్రాస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి సాదుల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: 

Janakiammal: దర్జీగా బతికిన గణిత మేధావి భార్య

Intermediate: ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలి

AP EAPCET: బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్

Published date : 22 Dec 2021 05:34PM

Photo Stories