ప్రజలు
Sakshi Education
ముఖ్యాంశాలు:
- భారత దేశంలోని శ్రామికులలో 92 శాతం మంది అవ్యవస్తీకృత రంగంలో ఉన్నారు. వాళ్ళకు సరిగా పని దొరకదు.
- దేశంలోని జనాభాకి సంబంధించిన సమాచారాన్ని భారతదేశ జనగణన అందిస్తుంది. సెన్సెస్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వ సంస్థ జనాభా సమాచార సేకరణ, నమోదులను నిర్వహించుతుంది.
- దేశంలో వివిధ వయసులలో స్త్రీ, పురుషులు ఎందరు ఉన్నారో ఇది తెలియ జేస్తుంది. జనాభా సామాజిక, ఆర్థిక నిర్మాణాన్ని ఇది తెల్పుతుంది.
- జనాభాలో ప్రతి వెయ్యిమంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారో తెలియ చేసేది లింగనిష్పత్తి. ఒక సమాజంలో, ఒక నిర్ధిష్ట కాలంలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం ఎంత ఉందో తెలియజేయు సామాజిక సూచిక లింగ నిష్పత్తి.
- మహిళల పట్ల వివక్షతను తగ్గించటానికి బలమైన శక్తిగా మహిళల చదువు ఉపయోగపడుతుంది.
- ఏడేళ్ళు పైన ఉండి ఏ భాష లోనైనా అర్థవంతంగా చదవగల్గితే, రాయగల్గితే, అతడు/ఆమె అక్షరాస్యులుగా పరిగణిస్తారు. సామాజిక ఆర్థిక ప్రగతికి అక్షరాస్యత కీలకమైనది.
- 15 నుండి 59 సంవత్సరాల వయస్సు సమూహాన్ని శ్రామిక జనాభా అంటారు. ఒక దేశంలోని లేదా ప్రాంతంలో ఒక నిర్ధిష్ట కాలంలో ఉదాహరణకు 10 సంవత్సరాలలో ప్రజల సంఖ్యలో మార్పుని ‘జనాభాలో మార్పు’ అంటారు.
జనాభా = తరువాతి కాలంనాటి జనసంఖ్య-ముందు కాలం నాటి జన సంఖ్య - ఒక ప్రాంతంలో జనాభాలో మార్పు= (జననాల సంఖ్య+ ప్రాంతం వలస వచ్చిన వారి సంఖ్య) -(మరణాల సంఖ్య+ప్రాంతం నుంచి బయటకు వలసల సంఖ్య)
- భారత దేశ జనాభా స్థిరంగా పెరుగుతూనే ఉంది. ఒక సంవత్సరంలో వేయి మంది జనాభాకు ఎంత మంది సజీవ పిల్లలు పుట్టారో అది జననాల రేటు.
- జనాభా విస్తరణను జన సాంద్రత బాగా తెలియ జేస్తుంది. ఒక నిర్ధిష్ట వైశాల్యంలో ఉండే ప్రజల సంఖ్య ఆధారంగా జన సాంద్రతను లెక్కించుతారు. ఉత్తర మైదాన ప్రాంతాలలో, కేరళలో చదునైన మైదానాలు, సారవంతమైన నేలలు, అధిక వర్షపాతం ఫలితంగా అధిక నుంచి చాలా అధిక జన సాంద్రత కలదు.
కీలక భావనలు:
- జనాభా పెరుగుదల: ఒక సంవత్సర కాలంలో మరణాల కంటే జననాలు ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది.
- జనసాంద్రత: జనాభా విస్తరణను జన సాంద్రత ను తెలియజేస్తుంది. ఒక నిర్ధిష్ట వైశాల్యంలో ఉండే ప్రజల సంఖ్య ఆధారంగా జన సాంద్రతను లెక్కగడతారు.
- లింగ నిష్పత్తి: జనాభాలో ప్రతి వెయ్యిమంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియ చేసేది లింగనిష్పత్తి. ఒక సమాజంలో ఒక నిర్ధిష్ట కాలంలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం ఎంత ఉందో తెలుసుకోటానికి ఉపయోగపడే ముఖ్యమైన సామాజిక సూచిక ఇది.
- ఫెర్టిలిటీ శాతం: ఒక నిర్ధిష్ట కాలంలో పిల్లలను పొందగల్గు సామర్థ్యం ఉన్న స్త్రీ, పురుషుల శాతాన్ని ఫెర్టిలిటీ శాతంగా వ్యవహరిస్తారు. ఒక స్త్రీ ఎంత మంది సంతానం కల్గి ఉన్నది ఇది తెల్పుతుంది.
- జనాభా విస్తరణ: సారవంతమైన భూమి, సాగునీటి వసతి ఇంతకు ముందు కంటే ఎక్కువ జనాభాని పోషించగల్గుతుంది. జనాభా విస్తరణను జన సాంద్రత బాగా తెలియజేస్తుంది. ఉత్తర మైదానాలు కేరళలో చదునైన మైదానాలు, సారవంతమైన నేలలు, అధిక వర్షపాతం ఫలితంగా అధిక జన సాంద్రత ఉంది.
- అక్షరాస్యత శాతం: ఏడేళ్ళు పైన ఉండి ఏభాషలోనైనా అర్థవంతంగా చదవగలిగితే, రాయగలిగితే అతడు/ఆమెను అక్షరాస్యులుగా పరిగణిస్తారు. సామాజిక, ఆర్థిక ప్రగతికి అక్షరాస్యత కీలకమైనది.
- భ్రూణహత్య: గర్భస్థ శిశువుల హత్యను భ్రూణ హత్యలు అందురు. తల్లి గర్భంలో ఉన్న దశలోనే శిశువులను చంపుటను భ్రూణహత్యలు అంటారు.
వ్యాసరూప ప్రశ్నలు:
1. లింగనిష్పత్తి చాలా ఎక్కువగాని, లేదా చాలా తక్కువగాని ఉంటే సమాజంపై పడే ప్రభావాలను పేర్కొనండి.జ:
- జనాభాలో ప్రతి వెయ్యిమంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియచేసేది లింగనిష్పత్తి.
- భారతదేశంలో పురుషుల కంటే ఎప్పుడూ స్త్రీల సంఖ్య తక్కువగానే ఉంది.
- లింగ నిష్పత్తి తక్కువగా ఉండుట వల్ల స్త్రీల పట్ల వివక్షత కొనసాగుతోంది.
- దీనివల్ల మహిళలకు అభివృద్ధిలో సమాన అవకాశాలు లభించటంలేదు.
- అత్యంత మౌలికమైన పోషకాహారం, శిశుసంరక్షణ, వైద్యం వంటి వాటిల్లో కూడా మహిళలు, బాలికల పట్ల వివక్షత కొనసాగుతోంది.
- మగ పిల్లల కంటే ఎక్కువ సంఖ్యలో ఆడపిల్లలు చనిపోతున్నారు. వారి పోషణ, సంరక్షణలలో వివక్షత ఉంటోంది.
- స్త్రీ, పురుషుల మధ్య అసమానతలు ఉండి, పురుషులకు అనుకూలంగా స్త్రీల పట్ల వివక్షతతో వ్యవహరించే ప్రాంతాలలో లింగ నిష్పత్తి అసమానంగా ఉంది.
- బాల్య వివాహాలు అధిక సంఖ్యలో జరగటం కూడా లింగ నిష్పత్తి తక్కువగా ఉండటమే కారణం.
- పురుషాధిక్య సమాజ నిర్మాణానికి తక్కువ లింగ నిష్పత్తి కూడా ఒక కారణంగా పేర్కొనచ్చును.
- లింగనిష్పత్తి ఎక్కువగా ఉన్న సమాజంలో స్త్రీల పట్ల వివక్షత ఉండదు. పురుషులతో పాటు సరియైన అవకాశాల కల్పన జరుగును.
- లింగనిష్పత్తి ఎక్కువగా ఉంటే బాల్యవివాహాలు అరికట్ట బడుతాయి. వారికి పోషకాహారం, విద్య వైద్యం సక్రమంగా అందుతుంది.
- లింగనిష్పత్తి ఎక్కువగా ఉండే మహిళలు అన్ని రంగాలలోకి వెళ్ళి తమ శక్తి సామర్థ్యాల మేరకు పని చేయటం ద్వారా దేశాభివృద్ధిలో తమ వంతు పాత్రను నిర్వహిస్తారు.
2. ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతాలలో జన సాంద్రత ఎక్కువగా ఉంది? దాని కారణాలు ఏమిటి?
జ:
జ:
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సామాజికంగా, ఆర్థికంగా రెండు ప్రధానమైన ప్రాంతాలుగా వర్గీకరించవచ్చు. అవి కోస్తా ఆంధ్ర, రాయలసీమ.
- 2011 జనాభా లెక్కల ప్రకారం కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ జన సాంద్రత ఉంది.
- కోస్తా ఆంధ్ర ప్రాంతంలో అధికభాగం అత్యధికంగా సారవంతమైన నేలలు, డెల్టా ప్రాంతం. సేద్యంనకు అత్యంత అనుకూలమైన ప్రాంతాలు. అందువల్ల వ్యవసాయం. ఈ ప్రాంతంలో అభివృద్ధి చెంది ఉంది.
- వ్యవసాయం రంగం వృద్ధి చెందుట వల్ల ఈ ప్రాంతంలో ప్రజలకు ఎక్కువ ఉపాధి అవకాశాలు కలవు.
- అనుకూలమైన వాతావరణం, సారవంతమైన నేలలు, వ్యవసాయం వృద్ధి ఉపాధి కల్పన అవకాశాలు పుష్కలంగా ఉండటం వల్ల కోస్తా ఆంధ్ర ప్రాంతంలో అధిక జన సాంద్రత కలదు.
3. జనాభా పెరుగుదల, జనాభా మార్పు మధ్య తేడాలను పేర్కొనండి.
జ:
జ:
- జనాభా నిరంతరం మారుతూ ఉంటుంది. సంఖ్య, విస్తరణ, అంశాలు వంటివి నిరంతరం మారుతూ ఉంటాయి. జననాలు, మరణాలు, వలసలు అనే మూడు ప్రక్రియల ప్రభావం వల్ల జనాభా అంశాలు మారుతూ ఉంటాయి.
- ఒక దేశంలో లేదా ప్రాంతంలో ఒక నిర్ధిష్ట కాలంలో ఉదాహరణకు పది సంవత్సరాలలో ప్రజల సంఖ్యలో మార్పుని ‘జనాభా మార్పు’ అంటారు.
- ప్రతి దశాబ్దానికి చేరిన అదనపు మనుషుల సంఖ్య జనాభా పెరుగుదలను సూచిస్తుంది.
- ఉదాహరణకు 2001 జనాభా నుంచి 1991 జనాభాని తీసేస్తే జనాభాలో వచ్చిన మార్పు తెలుస్తుంది. తీసివేయగా వచ్చిన సంఖ్య ధనాత్మకమయితే జనాభా పెరిగిందంటారు. ఋణాత్మకమైతే తగ్గిందంటారు.
జనాభా మార్పు= (తరువాతి కాలం నాటి జనాభా)-(ముందు కాలం నాటి జనాబా) - ఒక ప్రాంత జనాభాలో ఒక సంవత్సర కాలంలో మరణాల కంటే జననాలు ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది.
ఒక ప్రాంతంలో జనాభా మార్పు= (జననాల సంఖ్య + ప్రాంతంలోకి వలస వచ్చిన వాళ్ళ సంఖ్య)-(మరణాల సంఖ్య+ప్రాంతం నుండి బయటకు వలస వెళ్లిన వాళ్ల సంఖ్య) - ఒక సంవత్సరంలో వెయ్యి మంది జనాభాకి ఎంత మంది సజీవ పిల్లలు పుట్టారో అది జననాల రేటు. మరణాల రేటు అన్నది ఒక సంవత్సరంలో ప్రతి వెయ్యి మందికి చనిపోయిన వాళ్ళ సంఖ్య. ఒక సంవత్సరంలో ప్రతి వేయి మందికి ఎంత మంది అదనంగా చేరారు అనేది శాతంలో చూపితే అది ‘జనాభా వృద్ధి శాతం’.
- జనాభా వృద్ధి శాతం సంవత్సరానికి లెక్కించుతారు. దీనిని ‘వార్షిక వృద్ధి శాతం’ భారతదేశ జనాభా స్థిరంగా పెరుగుతూనే ఉంది.
సంక్షిప్త సమాధాన ప్రశ్నలు:
1. తప్పు వాక్యాలను గుర్తించి వాటిని సరి చేయండి.
అ. ప్రతి పది సంవత్సరాలకు జనాభా గణన చేపడతారు. (అవును)
ఆ. జనాభాలోని పెద్ద వాళ్లలో ఆడవాళ్ళ సంఖ్యను లింగ నిష్పత్తి తెలియజేస్తుంది. (కాదు)
ఇ. వయస్సును బట్టి జనాభా విస్తరణను వయస్సు సమూహం తెలియజేస్తుంది. (అవును)
ఈ. కొండ ప్రాంతాలలోని వాతావరణాన్ని ప్రజలు ఇష్టపడతారు. కాబట్టి అక్కడ జనాభా సాంద్రత ఎక్కువ. (కాదు)
2. దిగువ పట్టిక ఆధారంగా కింద ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
ప్రపంచ జనాభా - గతం, భవిష్యత్తు అంచనా (మిలియన్లలో)
సంవత్సరం
1. తప్పు వాక్యాలను గుర్తించి వాటిని సరి చేయండి.
అ. ప్రతి పది సంవత్సరాలకు జనాభా గణన చేపడతారు. (అవును)
ఆ. జనాభాలోని పెద్ద వాళ్లలో ఆడవాళ్ళ సంఖ్యను లింగ నిష్పత్తి తెలియజేస్తుంది. (కాదు)
ఇ. వయస్సును బట్టి జనాభా విస్తరణను వయస్సు సమూహం తెలియజేస్తుంది. (అవును)
ఈ. కొండ ప్రాంతాలలోని వాతావరణాన్ని ప్రజలు ఇష్టపడతారు. కాబట్టి అక్కడ జనాభా సాంద్రత ఎక్కువ. (కాదు)
2. దిగువ పట్టిక ఆధారంగా కింద ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
ప్రపంచ జనాభా - గతం, భవిష్యత్తు అంచనా (మిలియన్లలో)
సంవత్సరం
సం.ము/ ప్రాంతం | 1500 | 1600 | 1700 | 1800 | 1900 | 1950 | 1999 | 2012 | 2050 | 2150 |
ప్రపంచం | 458 | 580 | 682 | 978 | 1650 | 2521 | 5978 | 7052 | 8909 | 9746 |
ఆఫ్రికా | 86 | 114 | 106 | 107 | 133 | 221 | 767 | 1052 | 1766 | 2308 |
ఆసియా | 243 | 339 | 436 | 635 | 947 | 1402 | 3634 | 4250 | 5268 | 5561 |
యూరపు | 84 | 111 | 125 | 203 | 408 | 547 | 729 | 740 | 628 | 517 |
లాటిన్ అమెరికా, కరేబియన్ | 39 | 10 | 10 | 24 | 74 | 167 | 511 | 603 | 809 | 912 |
ఉత్తర అమెరికా | 3 | 3 | 2 | 7 | 82 | 172 | 307 | 351 | 392 | 398 |
ఓషియానియా | 3 | 3 | 3 | 2 | 6 | 13 | 30 | 38 | 46 | 51 |
- ప్రపంచ జనాభా మొదటిసారి రెట్టింపు కావటానికి సుమారుగా ఎన్ని శతాబ్ధాలు పట్టిందో తెలుసుకోండి.
- ఇంతకు ముందు తరగతులలో మీరు వలస పాలన గురించి చదివారు. పట్టిక చూసి 1800 నాటికి ఏఖండాలలో జనాభా తగ్గిందో తెలుసుకోండి.
- ఏ ఖండంలో ఎక్కువ కాలంపాటు అధిక జనాభా ఉంది?
- భవిష్యత్తులో జనాభా గణనీయంగా తగ్గనున్న ఖండం ఏదైనా ఉందా?
జ: 1. మూడు శతాబ్ధాలు
2. లాటిన్ అమెరికా అండ్ కరేబియన్
3. ఆసియా
4. అవును ఐరోపా (యూరపు) ఖండం.
3. భారత దేశ అక్షరాస్యతను ఇతర దేశాలతో పోల్చండి. బ్రెజిల్, శ్రీలంక, దక్షిణ ఆఫ్రికా, నేపాల్, బంగ్లాదేశ్, నార్వే, చిలీ, ఇండోనేసియా, ఎటువంటి సారూప్యాలు తేడాలు మీరు గమనించారు?
జ:
- పైన ఉన్న అన్ని దేశాల అక్షరాస్యత రేట్లు భిన్నంగా ఉన్నాయి. నేపాల్ మరియు బంగ్లాదేశ్‌లలో అత్యల్ప అక్షరాస్యత భారతదేశం కన్నా తక్కువగా 66% మరియు 57.7% గా కలవు.
- 2011 జనాభాలెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత రేటు 74.04%
- బ్రెజిల్ - 90.4%, దక్షిణాఫ్రికా - 93%, చిలీ - 98.6%, శ్రీలంక - 91.2% నార్వే - 100% ఇండోనేషియా - 90.4%, అక్షరాస్యత రేట్లుగా కలవు. అన్ని, భారతదేశ అక్షరాస్యత కన్నా ఎక్కువ గా కలవు.
4. కింద ఇచ్చిన స్వీడన్, కెన్యా, మెక్సికో దేశాల వయస్సు సమూహాన్ని పోల్చండి.
- ఈ దే శాలలో జనాభా పెరుగుదల ఎలా ఉంటుంది?
- ఏ దేశాల జనాభా ఇంకా తగ్గవచ్చు?
- అన్ని దేశాలలో లింగ నిష్పత్తి సమతుల్యంగా ఉందా?
- ఈ దేశాల కుటుంబ సంక్షేమ పఢకాలు ఏమై ఉండవచ్చు?
జ:
1. భారతదేశ జనాభా పెరుగుదలను సూచిస్తుంది.
2. స్వీడన్ జనాభా క్రమంగా తగ్గుతుంది.
3. మెక్సికో అధిక లింగ నిష్పత్తి కల్గిఉంది (1041), స్వీడన్ లింగ నిష్పత్తి (1020), కెన్యా లింగనిష్పత్తి (1000). భారతదేశ లింగ నిష్పత్తి స్త్రీలు (940) ప్రతి వెయ్యి మంది పురుషులకు.
4. కుటుంబ బీమా పథకాలు, వృదా్దప్యంలో రక్షణ వల్ల కుటుంబ సంక్షేమం కల్గుతుంది.
మ్యాప్ వర్క్
రాష్ట్రాలను సూచించే భారతదేశ పటంలో 2011 జనాభా గణాంకాల ఆధారంగా అయిదు స్థాయిలలో జనసాంద్రతను సూచించండి.
Published date : 28 Dec 2023 12:10PM