Tenth Exams: యూడైస్‌లో పేరుంటేనే 'పది' పరీక్షలకు అనుమతి
భువనగిరి : విద్యార్థుల వివరాలు పక్కాగా ఉండేలా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా యూడైస్(యూనిపైడ్ డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్)లో పేరు నమోదైన వారినే పదో తరగతి పరీక్షలకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యార్థుల వివరాలను యూడైస్‌లో నమోదు చేయడం పూర్తి చేసింది.
అవకతవకలకు వీల్లేకుండా..
కొన్ని పాఠశాలలు అనుమతి లేకుండా పదో తరగతి వరకు అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. వార్షిక పరీక్షల సమయంలో ఇతర పాఠశాలల్లో పేర్లు నమోదు చేయించి పరీక్షలు రాయిస్తున్నాయి. ఇక నుంచి యూడైస్‌లో పేరు నమోదై ఉంటనే టెన్త్ వార్షిక పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వనున్నారు. అంతేకాకుండా విద్యార్థుల సంఖ్య పక్కాగా తేలనుంది.
చదవండి: TS 10th Class Study Material
హెచ్‌ఎంల ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ఫామ్‌లు భర్తీ
యూడైస్‌లో పదో తరగతి విద్యార్థుల వివరాలు నమోదు చేయడానికి విద్యాశాఖ ఇచ్చిన గడువు ఈ నెల 28వ తేదీతో ముగిసింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్‌లను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలోనే భర్తీ చేశారు.
విద్యార్థులు ఇలా..
జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 9,524 మంది ఉన్నారు. ఇందులో ప్రభుత్వ విద్యార్థులు 5,243 మంది ఉండగా మిగతా వారు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నారు. దాదాపు విద్యార్థులందరి వివరాలను యూడైస్‌లో నమోదు చేశారు.
చదవండి: Model papers