Govt School: స్కూల్ చుట్టూ చీరలు.. సంగతేంటి సారూ!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: అది ప్రభుత్వ పాఠశాల.. ప్రహరీ గోడ లేకపోవడంతో పశువులు, పందులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి.

రహదారికి ఆనుకుని ఉండటంతో దుమ్మూధూళి అధికంగా వస్తోంది. ప్రహరీ నిర్మాణానికి డబ్బులు లేక ఉపాధ్యాయులే పాఠశాల చుట్టూ చీరలు (Sarees) కట్టారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ (Husnabad) మండలం జిల్లెలగడ్డ (Jilleligada) గ్రామ ప్రభుత్వ పాఠశాల దుస్థితి ఇది.
చదవండి: Free Coaching: RRB, SSC, Banking ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే!
దుమ్మూధూళి తరగతి గదులలోపలికి వచ్చి విద్యా బోధనకు ఇబ్బంది కలిగిస్తోందని ఉపాధ్యాయులు తెలిపారు. చేసేదిలేక చీరలను అడ్డుగా కట్టించామన్నారు. కలెక్టర్ స్పందించి ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
Published date : 08 Feb 2025 01:01PM