Earthquake in China: మరోసారి చైనా వాసులను భయపెట్టిన భూకంపం.. అక్కడి పరిస్థితి ఇది..!
భారీ భూకంపం మన పొరుగు దేశం చైనాను కుదిపేసింది. గత అర్ధరాత్రి సమయంలో సంభవించిన భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. భారీ సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. సహాయక బృందాలు ఇప్పటిదాకా 110కిపైగా మృతదేహాల్ని వెలికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక.. వాయువ్య గన్స్, కింగ్‌హై ప్రావిన్స్‌ల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం 5.9గా పేర్కొంది. భూకంపం వల్ల వందల మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్నవాళ్లను బయటకు తీసే క్రమంలో మృతదేహాలు బయటపడుతున్నాయి.
మొబైల్ టార్చ్‌ల వెలుతురులో రెస్క్యూ..
చైనాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. విపరీతంగా మంచు కురవడం, వాన కురుస్తుండడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అర్ధరాత్రి భూకంపం నేపథ్యంలో చేపట్టిన సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని తెలుస్తోంది. రెస్క్యూ టీం వాహనాలను రోడ్లపై పేరుకుపోయిన మంచు ముందుకు వెళ్లనివ్వడం లేదు. దీంతో సిబ్బందికి స్ట్రెచర్‌లను మోసుకుంటూ కొంతదూరం వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు అంధకారం నెలకొనడంతో.. సెల్‌ఫోన్ టార్చ్‌ల వెలుతురులోనే సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి బృందాలు. రెస్క్యూ బృందాలు తమ శక్తిమేర సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించారు.
Bharat Biotech: భారత్ బయోటెక్.. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ మధ్య ఒప్పందం.. అందుకేనా..?
మరోవైపు సోషల్‌మీడియాలో భూకంప తాలుకా దృశ్యాలు కనిపిస్తున్నాయి.
గతంలో..
భూకంపాలు చైనాలోనూ సర్వసాధారణమే. ఈ ఏడాది ఆగష్టులో 5.4 తీవ్రతతో తూర్పు చైనాలో భూకంపం సంభవించి 23 మంది గాయపడ్డారు. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో సిచువాన్ ప్రావిన్స్‌లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 100 మంది చనిపోయారు. అయితే.. 2008లో రిక్టర్ స్కేల్‌పై 7.9 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం మాత్రం 87 వేల మందిని కబళించింది. అందులో దాదాపు ఆరు వేల మంది చిన్నారులే ఉన్నారు.