Earthquake: అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ!
Sakshi Education
అమెరికాలోని కాలిఫోర్నియా తీర ప్రాంతంలో అమెరికా కాలమానం ప్రకారం డిసెంబర్ 5వ తేదీ భారీ భూకంపం వచ్చింది.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదైంది. ఫెర్నడెల్ పట్టణంలో భూకంప కేంద్రం నమోదైంది. ఈ విషయాన్ని అమెరికా జియోగ్రఫికల్ సర్వే విభాగం వెల్లడించింది. తీర ప్రాంతంలో భారీ భూకంపం రావడంతో అమెరికా సునామీ కేంద్రం ముందస్తు చర్యగా సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
శాన్ ఫ్రాన్సిస్కోకు 418 కి.మీ దూరంలో ఫెర్న్‌డేల్ పట్టణంలో భూ ప్రకంపనల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే భూకంప ప్రభావంతో పెట్రోలియా, స్కాటియా, కాబ్ తదితర ప్రాంతాల్లో శక్తిమంతమైన ప్రకంపనలు నమోదయ్యాయి.
ఉత్తర దిశలో వచ్చన భూ ప్రకంపనలు దక్షిణ ప్రాంతంలోని శాన్‌ఫ్రాన్సిస్కో దాకా వచ్చాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. భూకంపం వల్ల భవనాల్లోని ప్రజలు కొంత సేపు అటుఇటు ఊగిపోయారు. భూకంపం ముగిసిన తర్వాత కూడా అనంతర ప్రకంపనలు వచ్చాయి.
Published date : 06 Dec 2024 01:36PM