Skip to main content

TSUTF: గురుకులాల పనివేళలు మార్చాలి 

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలోని పాఠశాలల పనివేళలు మార్చాలని టీఎస్‌ యూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి ప్రభుత్వాన్ని కోరారు.
TSUTF
గురుకులాల పనివేళలు మార్చాలి 

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, జనరల్‌ గురుకుల పాఠశాలల మాదిరిగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించాలని కోరారు. ఈమేరకు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి నవంబర్‌ 17న తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఉపాధ్యాయుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

చదవండి: TREIRB: కొలువుల భర్తీకి కసరత్తు.. సొసైటీల వారీగా భర్తీకి అనుమతి లభించిన ఉద్యోగాల సంఖ్య ఇలా..

దీనిపై మంత్రి గంగుల సానుకూలంగా స్పందిస్తూ అన్ని సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులకు ఒకే రకమైన సదుపాయాలు, ఉపాధ్యాయులకు ఒకే విధమైన వేతనాలు అమలు చేస్తున్నామని, పాఠశాలల పనివేళలు కూడా ఒకే విధంగా అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు వివరించారు. గెస్ట్‌ టీచర్లకు కూడా దసరా సెలవుల పేరిట కోత విధించిన వేతనాన్ని మానవతా దృక్పథంతో తిరిగి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు నవంబర్‌ 17న ఒక ప్రకటనలో తెలిపారు. 

చదవండి: Admissions: ఈ విద్యా సంస్థల్లో సీట్లు ఖాళీ లేవంటూ బోర్డులు

Published date : 18 Nov 2022 01:20PM

Photo Stories