Skip to main content

TS SSC 2023 Exam Paper Leak : టెన్త్‌ పేపర్ లీక్‌పై మంత్రి సబిత ఏమ‌న్నారంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో పేప‌ర్ల లీకేజీ వ్య‌వ‌హారం కొన‌సాగుతునే ఉంది. తాజాగా టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన తెలుగు, హింది పేప‌ర్లు లీకైన విష‌యం తెల్సిందే.
sabitha indra reddy latest today news in telugu
Sabitha Indra Reddy

ఈ ఘ‌ట‌న‌పై తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సీరియస్ అయ్యారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే  ఉద్యోగులను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించనున్నట్టు  మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. 

☛ AV Ranganath: పేపర్‌ లీక్‌ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చిందంతే!

ప్ర‌శ్నాపత్రాలు లీక్ కాలేదు.. కానీ..

sabitha indra reddy tenth paper leak news in telugu

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ  ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.  రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని, ఈ విషయంలో  పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని  తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ దేవసేన, పోలీస్ రేంజ్ ఐ.జిలు షానవాజ్ కాసీం , చంద్రశేఖర్ రెడ్డి లు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | క్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల విష‌యంలో..
ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందని, ఈ పరీక్షల విషయంలో తమ స్వార్థ  ప్రయోజనాలకై విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. 

ఈ పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని,  ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని, పరీక్షల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని  సబితా స్పష్టంచేశారు. 

పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఈ విషయంలో ఏవిధమైన అపోహలకు, అనుమానాలకు తావు లేదని మంత్రి పేర్కొన్నారు. పరీక్షా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీ లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను పటిష్టంగా అమలు చేయడంతోపాటు జిరాక్స్ షాప్‌లను మూసివేయించాలని అన్నారు. 

10Th Class Paper Leak: ఉద్దేశ‌పూర్వ‌కంగానే పేప‌ర్ లీక్.. ఐదుగురిపై సస్పెక్ష‌న్ వేటు.. రేప‌టి ప‌రీక్ష‌లు య‌థాత‌థం

స్లిప్‌ల రూపంలో సమాధానాలు పంపేందుకే..
టెన్త్‌ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి నిందితుల రిమాండ్ రిపోర్టులు కీలక విషయాలు వెల్లడయ్యాయి.  తెలిసిన విద్యార్థుల కోసమే బందెప్ప, సందెప్ప పేపర్ లీక్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. స్లిప్‌ల రూపంలో సమాధానాలు పంపేందుకే ఇలా చేసినట్లు తెలిపారు. క్వశ్చ‌న్‌ పేపర్‌ ఫొటో పెట్టాలని బందెప్పను సమ్మప్ప కోరగా.. పరీక్షకు రాని ఓ విద్యార్థి ప్రశ్నాపత్రాన్ని అతను పంపినట్లు రిమాండ్ రిపోర్టులో వివరించారు.  పొరపాటున మరో గ్రూప్‌లో కూడా ప్రశ్నాత్రాన్ని బందెప్ప పోస్ట్ చేశాడని,  అప్రమత్తమై డిలీచ్ చేసే లోపే పలువురు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లు చెప్పారు. బందెప్ప నుంచే పేపర్ బయటకు వచ్చినట్లు గుర్తించారు.

Published date : 04 Apr 2023 08:00PM

Photo Stories