10Th Class Paper Leak: ఉద్దేశపూర్వకంగానే పేపర్ లీక్.. ఐదుగురిపై సస్పెక్షన్ వేటు.. రేపటి పరీక్షలు యథాతథం
మొత్తం 5 మంది సస్పెండ్
సోమవారం ఉదయం 9.30 గంటలకు తెలుగు పేపర్ పరీక్ష ప్రారంభమైంది. 9.37 నిమిషాలకు అదే పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తాండూరులోని ఓ పాఠశాల నుంచి పేపర్ లీక్ అయినట్లు పోలీసులు నిర్ధారించి, కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మొత్తం నలుగురికి సంబంధం ఉన్నట్లు గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సూపరింటెండెంట్‌ను కూడా తప్పించారు.
చదవండి: బిగ్ బ్రేకింగ్... మొదటి రోజే టెన్త్ పరీక్ష పేపర్ల లీక్..?
ఉద్దేశపూర్వకంగానే లీక్ చేశారు
తెలుగు పేపర్‌ను ఉద్దేశపూర్వకంగానే లీక్ చేసినట్లు వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. శివకుమార్, గోపాల్, బందప్ప, సమ్మప్పలను వెంటనే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పేపర్‌ను లీక్ చేసిన బందప్ప, సమ్మప్పలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇన్విజిలేటర్ బందప్పపై గతంలోనూ కేసులు నమోదయ్యాయన్నారు. 2017లో ఇతనిపై పొక్సో కేసు నమోదైనట్లు తెలిపారు. లీకేజీ విషయం బయటపడగానే మొబైల్ నుంచి పేపర్ను డిలీట్ చేసినట్లు గుర్తించారు. బందప్ప భార్య కూడా అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోందన్నారు.
చదవండి: ఏపీలో పది పరీక్షలు ప్రారంభం... 19వ తేదీ నుంచే మూల్యాంకనం....
ఎస్ఎస్‌సీ బోర్డు ఎదుట ఆందోళన
పేపరు లీకేజీ ఘటనతో తెలంగాణ ఎస్ఎస్‌సీ బోర్డు ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ఎన్ఎస్‌యూఐ నేతల యత్నించడంతో వారిని అడ్డుకుని, పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రేపటి పదో తరగతి పరీక్షలు మాత్రం యథావిథిగా జరుగుతాయని, విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నారు.