Big Breaking: బిగ్ బ్రేకింగ్... మొదటి రోజే టెన్త్ పరీక్ష పేపర్ల లీక్..?
Sakshi Education
తెలంగాణలో పేపర్ లీక్‌ల వ్యవహారం సంచలనంగా మారింది. రాష్ట్రంలో సోమవారం నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, పరీక్ష ప్రారంభమైన కాసేపటికే పరీక్ష పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కలకలం సృష్టించింది.
చదవండి: ఇకపై కొత్త జిల్లాల పేర్లతో అడ్రస్ సర్టిఫికెట్లు రెడీ... ఎప్పటినుంచంటే
వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే చక్కర్లు కొట్టింది. పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే(9 గంటల 37 నిమిషాలకు) తెలుగు పేపర్ తాండూరులో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా పట్టణమంతా వాట్సప్ గ్రూపులల్లో సర్క్యూలేట్ అయ్యింది. వెంటనే అలర్టైన పోలీసులు పేపర్ లీకేజీపై ఆరా తీస్తున్నారు. పోలీసులతో పాటు విద్యాశాఖాధికారులు పేపర్ ఎక్కడి నుంచి లీక్ అయ్యింది, ఎవరు లీక్ చేశారు అన్న దానిపై లోతుగా పరిశీలిస్తున్నారు. వాట్సప్‌లో సర్క్యులేట్ చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
చదవండి: ఏపీలో పది పరీక్షలు ప్రారంభం... 19వ తేదీ నుంచే మూల్యాంకనం....
Published date : 03 Apr 2023 03:04PM