Tenth Class Results: 86.60% పాస్.. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలు విడుదల..
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మే 10న హైదరాబాద్‌లో పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావులతో కలసి టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తంగా 4,94,504 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,91,862 మంది పరీక్షలు రాశారని, ఇందులో 4,22,795 మంది (86.60 శాతం) ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,793 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైందని... 25 స్కూళ్లలో సున్నా ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా 99శాతం ఉత్తీర్ణతతో ముందు వరుసలో ఉండగా.. వికారాబాద్ జిల్లా 59.46 శాతంతో చివరన నిలిచినట్టు తెలిపారు. ప్రభుత్వ గురుకులాలు 98.25 శాతంతో టాప్‌లో నిలిచాయని.. రెసిడెన్షియల్, సోషల్, బీసీ, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ స్కూళ్లు కూడా సగటుకుపైగా ఉత్తీర్ణత శాతాన్ని సాధించాయని వివరించారు. ఫెయిలైన వారు ఆందోళనకు గురికావొద్దని.. ఆత్మస్థైర్యంతో మళ్లీ పరీక్షలు రాసి విజయం సాధించాలని సూచించారు. ఇంటర్ విద్యార్థులు క్షణికావేశంతో బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రుల ఆవేదనను గుర్తు చేసుకోవాలన్నారు.
చదవండి: Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్ అర్హతగా జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల వివరాలు ఇవే..
15 రోజుల పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్
ఫలితాలు విడుదలైన 15 రోజుల్లోగా విద్యార్థులు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున స్టేట్ బ్యాంకు ద్వారా రుసుము చెల్లించాలని.. దరఖాస్తులను పోస్టు ద్వారా తమ కార్యాలయానికి పంపాలని సూచించారు. రీవెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు సంబంధిత పాఠశాల ద్వారా జిల్లా విద్యాశాఖాధికారికి దరఖాస్తు పంపాలని చెప్పారు. దరఖాస్తు నమూనా ఠీఠీఠీ.bట్ఛ.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్‌సైట్‌లో లభిస్తుందని తెలిపారు. రీ వెరిఫికేషన్ జిల్లా స్థాయిలో జరుగుతుందని, దీనికోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.వెయ్యి రుసుము చెల్లించాలని స్పష్టం చేశారు.
చదవండి: Best Polytechnic Courses After 10th: పాలిటెక్నిక్ డిప్లొమా.. భవితకు ధీమా
జూన్ 14 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 14 నుంచి 22వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్‌ను ఎస్సెస్సీ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు మే 10న విడుదల చేశారు. విద్యార్థులు మే 11 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మూడు సబ్జెక్టుల వరకు రూ.110 ఫీజు, అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులకు అయితే రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సైన్స్ సబ్జెక్టుకు అదనంగా 20 నిమిషాలు సమయం ఉంటుందన్నారు.
చదవండి: Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్ అవకాశాలు ఇవే..
2,793 స్కూళ్లలో అందరూ పాస్
పదో తరగతిలో రాష్ట్రవ్యాప్తంగా 2,793 పాఠశాలల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఇందులో ప్రైవేటు స్కూళ్లు 13 ఉంటే.. ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూళ్లు 9, ఎయిడెడ్ స్కూళ్లు 3 ఉన్నాయి. జీరో ఉత్తీర్ణత వచ్చిన పాఠశాలల్లో పనితీరుపై సమీక్ష చేపడతామని మంత్రి సబిత తెలిపారు.
చదవండి: AP RGUKT IIIT notification 2022-2023: పదో తరగతితోనే.. బీటెక్
ఇంగ్లిష్ మీడియంలో ఎక్కువ పాస్
పదో తరగతి పరీక్షల్లో మాధ్యమం (మీడియం) వారీగా చూస్తే.. ఆంగ్ల మాధ్యమం వారిలో ఉత్తీర్ణత ఎక్కువగా ఉంది. ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసినవారిలో 90.50 శాతం ఉత్తీర్ణులుకాగా.. ఉర్దూ మీడియంలో 73.45, తెలుగు మీడియంలో 72.58 శాతం పాస్ అయ్యారు. ఇక ప్రధాన సబ్జెక్టుల్లో సాంఘిక శాస్త్రంలో, భాషా సబ్జెక్టుల్లో హిందీ (సెకండ్ లాంగ్వేజ్)లో ఎక్కువ శాతం పాస్ అయ్యారు. మొత్తంగా అన్ని భాషల్లోనూ 90శాతంపైనే ఉత్తీర్ణత కనిపించింది.
ఏ సబ్జెక్టులో ఎంత మంది పాస్?
భాష |
ఉత్తీర్ణుల సంఖ్య |
శాతం |
మొదటి భాష |
4,76,197 |
98.17 |
ద్వితీయ భాష (హిందీ) |
4,81,885 |
99.70 |
తృతీయ భాష (ఆంగ్లం) |
4,75,843 |
98.45 |
గణితం |
4,43,743 |
91.65 |
సామాన్య శాస్త్రం |
4,54,708 |
93.91 |
సాంఘిక శాస్త్రం |
4,78,483 |
98.83 |
గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (జీపీఏ) వారీగా ఉత్తీర్ణులు
జీపీఏ |
ఉత్తీర్ణుల సంఖ్య |
10 |
6,163 |
9 – 9.8 |
83,597 |
8 – 8.8 |
1,23,665 |
7 – 7.8 |
1,16,673 |
6 – 6.8 |
71,683 |
5 – 5.8 |
17,279 |
4 – 4.8 |
400 |
మేనేజ్‌మెంట్ వారీగా వంద శాతం ఉత్తీర్ణత తీరు
మేనేజ్‌మెంట్ |
మొత్తం స్కూళ్లు |
వంద శాతం ఉత్తీర్ణత |
ఎయిడెడ్ |
162 |
16 |
ఆశ్రమ పాఠశాలలు |
227 |
38 |
బీసీ వెల్ఫేర్ |
255 |
89 |
కేజీబీవీ |
475 |
91 |
మోడల్ స్కూళ్లు |
194 |
38 |
రెసిడెన్షియల్ |
35 |
21 |
రెసిడెన్షియల్ మినీ |
207 |
55 |
సోషల్ వెల్ఫేర్ |
239 |
73 |
ట్రైబల్ వెల్ఫేర్ |
99 |
24 |
ప్రభుత్వ స్కూళ్లు |
491 |
23 |
జిల్లా పరిషత్ |
4,108 |
915 |
ప్రైవేటు స్కూళ్లు |
4,966 |
1,410 |
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ టైం టేబుల్ ఇదీ..
14.6.23 |
మొదటి భాష |
15.6.23 |
రెండో భాష |
16.6.23 |
ఇంగ్లిష్ |
17.6.23 |
మేథమెటిక్స్ |
19.6.23 |
సైన్స్ |
20.6.23 |
సోషల్ స్టడీస్ |
21.6.23 |
ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్–1 |
22.6.23 |
ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్–2 |