DEO Bikshapathi: టీచర్లకు శిక్షణ
Sakshi Education
నల్లగొండ: ప్రభుత్వ ఉన్నత, ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల విద్యాభివృద్ధికి ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నతి, అలాగే 10వ తరగతి విద్యార్థులకు లక్ష్య కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు డీఈఓ బొల్లారం భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు.
దీంట్లో భాగంగా జిల్లాలో తొలుత 226 మంది హెచ్‌ఎంలు, 17 మంది ప్రిన్సిపాళ్లు, 28 మంది ప్రత్యేక అధికారులకు నల్లగొండలోని డైట్ కళాశాలలో ఆగస్టు 21న నుంచి ఆగస్టు 28 వరకు శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఆ తర్వాత 2,976 మంది ఉపాధ్యాయులకు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 18 వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణకు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులంతా విడుతల వారీగా తప్పక హాజరు కావాలని ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షకుడిగా సమగ్ర శిక్షా కోఆర్డినేటర్ ఆర్.రామచందర్‌ను నియమించినట్లు తెలిపారు.
చదవండి:
Teachers Leave Procedure: డుమ్మా టీచర్లపై నజర్! టీచర్ల సెలవుల అనుమతి ఎలా..?
Published date : 21 Aug 2023 05:14PM