పదో తరగతి పరీక్షలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
వారంలో టెన్త్ హాల్ టికెట్లు
వారంలో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వనున్నారు. మే 23 నుంచి టెన్త్ పరీ క్షలు జరగనున్నాయి. 5,09,275 మంది ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ క్షేత్రస్థాయి ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. తాజాగా నామినల్ రోల్స్, కంప్యూటరైజ్డ్ హాల్ టికెట్లను అన్ని మండలాలకు పంపింది. అందులో తప్పులు ఉంటే సరిచేయాలని ఆదే శించింది. పొరపాట్లు సవరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు ప్రత్యేక అధికారులను నియ మించినట్లు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. సవరణల సమాచారం వారికి పంపాలని అధికారులు సూచించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యా క విద్యార్థులకు హాల్ టికెట్లు అందిస్తారు.