Tenth Class: పకడ్బందీగా పది పరీక్షలు.. హాల్ టికెట్లు ఇసారి ఇలా..
పదో తరగతి పరీక్షల నిర్వహణపై మార్చి 18న బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు హాల్ టికెట్లను మార్చి 24 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడంతోపాటు, పాఠశాలలకు కూడా పంపుతున్నట్టు తెలిపారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
రాష్ట్రవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. మొత్తం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.