MJPTBCWREIS: బీసీ గురుకుల కాలేజీ ప్రవేశ పరీక్ష తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలోని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశానికి ఏప్రిల్ 30న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు.
బీసీ గురుకుల కాలేజీ ప్రవేశ పరీక్ష తేదీ ఇదే..
ఈ మేరకు ఏప్రిల్ 19న ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 22,400 సీట్లు ఉండగా 58,113 దరఖాస్తులు వచ్చాయని, డిగ్రీలో 4,560 సీట్లు ఉండగా 8,429 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో సహా 277 సెంటర్లలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు.