Garima Agarwal: ఉపాధ్యాయులూ.. సెలవులు లేకుండా పనిచేయండి
![Education department officials ensuring teacher presence during exams Garima Agarwal instructing education department on exam leave Teachers work without holidays Siddipet Additional Collector Garima Agarwal overseeing exam preparations](/sites/default/files/images/2024/01/09/teacher-jobs-home-top-story-1704787137.jpg)
జనవరి 8న కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో ఎంఈఓ, ఎంఎన్‌ఓ, సీఎచ్‌ఎంలు, విధ్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అగర్వాల్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలన్నారు. పదోతరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు.
చదవండి: Sainik School: దేశంలోనే తొలి బాలికల సైనిక్ స్కూల్
జిల్లా విద్యాధికారి మొదలు మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలాగే కిందిస్థాయి సిబ్బంది ఉపాధ్యాయులు సైతం వార్షిక పరీక్షలు ముగిసే వరకు డైరీని తయారు చేసుకుని సంతకంతో తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
రోజు వారీగా హాజరు వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు అదనంగా తరగతులు తీసుకుని బోధించాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ భాస్కర్ పాల్గొన్నారు.