DEO Ravinder: విద్యార్థులకు జీవన నైపుణ్యాలు నేర్పించాలి
Sakshi Education
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలతో పాటు జీవన నైపుణ్యాలు నేర్పించాలని డీఈఓ రవీందర్ పేర్కొన్నారు.
ఈ మేరకు జిల్లాకేంద్రంలోని మహబూబ్‌నగర్ అర్బన్ కేజీబీవీలో సీఆర్టీలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు కౌమారదశలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పించాలని, భావోద్వేగాల నియంత్రణ చేసుకునే విధంగా వివరించాలని తెలిపారు.
చదవండి: Gopagani Ramesh: చదువుకున్న పాఠశాలకే హెచ్‌ఎంగా..
దీని ద్వారా విద్యార్థులకు ఆహ్లాదకరమైన, సంతోషకరమైన, నాణ్యమైన విద్యను పొందగలరని తెలిపారు. అకాడమిక్ పరమైన అంశాలతో పాటు, ఆత్మవిశ్వాసం పెంచి, మంచి మార్కులు సాధించే విధంగా విద్యను బోధిచాలని సూచించారు. కార్యక్రమంలో సీఎంఓ బాలుయాదవ్, కేజీబీవీ ఎస్‌ఓ శంకరమ్మ, రీసోర్స్‌పర్సన్లు విజయలక్ష్మీ, జోత్స్స పాల్గొన్నారు.
చదవండి: School Holidays: సెప్టెంబర్ 28న పాఠశాలలు, కాలేజీలకు సెలవు?.. కారణం ఇదే..!
Published date : 20 Sep 2023 02:57PM