Gopagani Ramesh: చదువుకున్న పాఠశాలకే హెచ్‌ఎంగా..
Sakshi Education
నేలకొండపల్లి: ఒకప్పుడు చదువుకున్న పాఠశాలలోనే ప్రధానోపాధ్యాయుడిగా పోస్టింగ్ రావడంతో ఆ ఉపాధ్యాయుడిని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
నేలకొండపల్లికి చెందిన గోపగాని రమేష్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న హెచ్‌ఎంల బదిలీల్లో భాగంగా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మి ఖమ్మం మామిళ్లగూడెం ఉన్నత పాఠశాలకు బదిలీ కాగా, ఖమ్మంలో పనిచేస్తున్న రమేష్‌ను నేలకొండపల్లికి కేటాయించారు.
దీంతో సెప్టెంబర్ 19న ఆయన విధుల్లో చేరగా, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు జెర్రిపోతుల సత్యనారాయణ, రత్నకుమార్, రమేష్ తదితరులు సన్మానించారు.
చదవండి:
Physics Wallah: సక్సెస్ కావాలంటే అజ్ఞానం ఉండాలంటున్న వేల కోట్ల అధిపతి... 5 వేలతో ప్రారంభమై...
Dwarapureddy Chandramouli: విధిని ఎదిరించాడు.. విజయం సాధించాడు
Published date : 20 Sep 2023 01:30PM