విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలి
సెప్టెంబర్ 23న మండలంలోని పున్నేలు, ఐనవోలు, ఒంటిమామిడిపల్లి, వెంకటాపూర్, ఉడుతగూడెం గ్రామాల ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవీని ఆయన సందర్శించారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్‌మెంట్ సర్వే(ఎస్‌ఈఏఎస్) పరీక్ష విధానాన్ని, పేరెంట్ టీచర్ మీటింగ్(పీటీఎం) సమావేశాలను పరిశీలించారు. ఈసందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఈఏఎస్ పరీక్ష వల్ల 3, 6, 9 తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకుని వారికి మరింత నాణ్యమైన విద్య అందించడానికి తోడ్పడుతుందన్నారు.
చదవండి: Devireddy Sudheer Reddy: ఉపాధ్యాయుల పాత్ర గొప్పది
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రభుత్వం ఎండీఎంలో 3 రోజులు గుడ్లు, మూడు రోజుల రాగిజావతోపాటు దసరా నుంచి ఉదయం అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు మంచి భోజనం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కృషిచేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమాల్లో స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, హెచ్‌ఎంలు శ్రీనివాస్‌రెడ్డి, ఆరోగ్యమ్మ, లింగారావు, రమేశ్, స్పెషల్ ఆఫీసర్ సునీత, వివిధ పాఠశాలల ఉపాధ్యాయలు పాల్గొన్నారు.