Gangula Kamalakar: కొత్త బీసీ గురుకులాలు
అక్టోబర్ 11వ తేదీన 33 బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించేందుకు సొసైటీ ఏర్పాట్లు చేస్తోంది. అదే విధంగా అక్టోబర్ 15వ తేదీన 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఆయా తేదీల నుంచే తరగతులు ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 2న మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, గురుకుల సొసైటీ కార్యదర్శితో ఆయన సమీక్ష నిర్వహించారు. నూతనంగా ప్రారంభించనున్న గురుకుల విద్యా సంస్థల్లో అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటిస్తున్నట్లు తెలిపారు. సాగర్ ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం హాలియాలో, అలాగే దేవరకద్ర, కరీంనగర్, సిరిసిల్ల, వనపర్తితో పాటు పాత జిల్లాల ప్రతిపాదికగా ప్రతి జిల్లాలో డిగ్రీ కాలేజీలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ప్రారంభించనున్న కొత్త గురుకులాలతో కలిపి బీసీ గురుకుల సొసైటీ పరిధిలో విద్యా సంస్థల సంఖ్య 310కి చేరిందని వివరించారు.
చదవండి: