Skip to main content

No Admissions: నో అడ్మిషన్స్‌.. మంత్రుల‌ సిఫారసుతో ప్రవేశాలు..

ముస్తాబాద్‌(సిరిసిల్ల): నాణ్యమైన విద్య, మెరుగైన వసతులతో కస్తూర్భాగాంధీ విద్యాలయాలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి.
Full admissions in 13 KGBVs

ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా ఫలితాలు సాధిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఇక్కడ చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు విద్యార్థుల కోసం ఇంటింటికి వెళ్లి ప్రవేశాలు తీసుకున్న స్థాయి నుంచి ‘నో అడ్మిషన్స్‌’ బోర్డు పెట్టే స్థాయికి కేజీబీవీలు చేరాయి.

13 కేజీబీవీలలో ఫుల్‌ అడ్మిషన్స్‌

జిల్లాలో 2011లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 13 కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలను ఏర్పాటు చేశాయి. మొదట్లో విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు.

చదవండి: Long Term NEET Coaching : ఎస్టీ గురుకుల్లాల్లో ఉచిత లాంగ్‌ టర్మ్‌ నీట్‌ కోచింగ్‌

ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి విద్యార్థులను చేర్చుకున్నారు. క్రమంగా కేజీబీవీల్లోని విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలు, అక్కడ ఉన్న సౌకర్యాల గురించి తెలుసుకొని క్రమంగా చేరుతున్నారు. రెండేళ్లుగా కేజీబీవీల్లో ప్రవేశాలు పెరిగాయి.

ఇంగ్లిష్‌ మీడియం.. చక్కటి వసతులు

జిల్లాలో రెండేళ్ల క్రితం ఇంగ్లిష్‌ మీడియంలో కస్తూ ర్భా విద్యాలయాల్లో బోధన చేస్తున్నారు. దీనికితోడు ఉదయం అల్పాహారంలో ఇడ్లి, వడ, పూరి, ఉప్మా, కిచిడి అందిస్తున్నారు.

బూస్ట్‌, స్వీట్లు, అరటిపండు, ఆపిల్‌, గ్రేప్స్‌ స్నాక్స్‌గా ఇస్తున్నారు. నెలలో ఆరుసార్లు చికెన్‌, ఒకసారి మాంసం భోజనంలో పెడుతున్నారు. వారంలో నాలుగు రోజులు కొడిగుడ్లు, ఏఎన్‌ఎం పర్యవేక్షణ ఉంటుంది. నెలకోసారి వైద్యాధికారి బాలికలను పరీక్షిస్తారు. చదువులో వెనుకబడ్డ వారికి ప్రత్యేక తరగతులు, ఉదయం స్నానానికి వేడినీళ్లు సైతం అందిస్తున్నారు.

మంత్రి సిఫారసుతో ప్రవేశాలు

గంభీరావుపేట, తంగళ్లపల్లి, సిరిసిల్ల, చందుర్తి, రుద్రంగి, వీర్నపల్లి కేజీబీవీల్లో ఆరు నుంచి ఇంటర్‌, ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి, ఇల్లంతకుంట, వేములవాడ, కోనరావుపేట, వేములవాడరూరల్‌ మండలాల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.

13 విద్యాలయాల్లో 3,560 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఒక్కో కేజీబీవీలో 200 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంది. అయితే చాలా మంది ఎమ్మెల్యే, మంత్రుల సిఫారసు లెటర్లతో వస్తుండడం వీటికి ఉన్న డిమాండ్‌ను తెలుపుతుంది.

Published date : 25 Jun 2024 01:45PM

Photo Stories