Skip to main content

EFLU: ఇందిరానగర్‌ పాఠశాలలో ఫారెన్‌ లాంగ్వేజెస్‌

ప్రశాంత్‌నగర్‌ (సిద్దిపేట): విద్యార్థులకు విదేశీ భాషలను నేర్పించేందుకు సామాజిక బాధ్యతలో భాగంగా English and Foreign Languages University (EFLU) సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంది.
Foreign Languages in Indiranagar School
అంగీకార పత్రాన్ని అందజేస్తున్న వీసీ సురేశ్‌కుమార్, పక్కన మంత్రి హరీశ్‌రావు 

ఈ మేరకు ఫిబ్రవరి 21న పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి వీసీ ప్రొఫెసర్‌ సురేశ్‌కుమార్‌ ఒప్పంద ప­త్రాన్ని (ఎంఓయూ) అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఇంగ్లిష్‌తో పాటుగా ఫ్రెంచ్, స్పానిష్, వంటి విదేశీ భాషలను బోధించనున్నారు. ఈ వారం నుంచే ఆన్‌లైన్‌లో తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. బోధనలు మరింత అర్థమయ్యే విధంగా యూనివర్సిటీకి తీసుకెళ్లి అక్కడ శిక్షణను ప్రత్యక్షంగా చూపించనున్నట్లు వెల్లడించారు. 

చదవండి: Communication skills: అంతర్జాతీయ అవకాశాలకు.. ఇంగ్లిష్‌! భాషపై పట్టు సాధించేందుకు మార్గాలు..

హరీశ్‌రావు కృతజ్ఞతలు 

ప్రపంచంతో పోటీపడేందుకు ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను అవసరమని, మాతృభాషతో పాటుగా ఇతర భాషలను నేర్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించేలా ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు.

చదవండి: Spoken English: ఈ పాఠశాలల్లో ‘స్పోకెన్‌ ఇంగ్లిష్‌’ క్లాసులు

కోరిన వెంటనే పాఠశాలను దత్తత తీసుకుని శిక్షణ ఇచ్చేందుకు తొలిసారి ముందుకువచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

చదవండి: Spoken English: ఇవి తెలుసుకుంటే... ఇంగ్లిష్‌లో ప్రశ్నించడం సులువే!

Published date : 22 Feb 2023 01:44PM

Photo Stories