Spoken English: ఈ పాఠశాలల్లో ‘స్పోకెన్ ఇంగ్లిష్’ క్లాసులు
Sakshi Education
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడేలా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరో ముందడుగు వేసింది.
26 జిల్లాల్లో తొలి దశలో భాగంగా జిల్లాకు 5 హైస్కూళ్లను ఎంపిక చేసి ప్రత్యేక ‘Spoken English’ తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. దశల వారీగా అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయనుంది. సాధారణ తరగతులతో పాటే ఆసక్తి కలిగిన విద్యార్థులకు ‘స్పోకెన్ ఇంగ్లిష్’ నేర్పిస్తారు.
చదవండి: Spoken English: ఇవి తెలుసుకుంటే... ఇంగ్లిష్‌లో ప్రశ్నించడం సులువే!
బెండపూడి.. నిడమానూరులో సక్సెస్
తూర్పుగోదావరి జిల్లాలోని బెండపూడి, గన్నవరం సమీపంలోని నిడమానూరు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇచ్చిన స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణతో అద్భుత ఫలితాలొచ్చాయి. దీనిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో తొలుత ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి.. ఆ తర్వాత విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు బోధించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
చదవండి: Google: ఇక ఇంగ్లీష్‌లో అదరగొట్టేయొచ్చు..ఈ సూపర్ ఫీచర్‌తోనే
Published date : 18 Aug 2022 04:06PM