Christina Z Chongthu: ఈ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం
Sakshi Education
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో వచ్చే విద్యా సంవ త్సరం నుంచి ఆంగ్ల మాధ్య మంలో బోధన ప్రారంభించా లని నిర్ణయించినట్లు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ వెల్లడించారు.
ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయు లంతా ఇంగ్లిష్ మీడి యంలో బోధించేందుకు సిద్ధంగా ఉండాల న్నారు. ఏప్రిల్ 8న టీఎస్‌ఐ పార్డ్‌లో గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయు లకు రెండ్రోజుల శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ, అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ సంయు క్తంగా ఆంగ్ల భాషాభివృద్ధి కోర్సును నిర్వహిస్తున్నాయని, ఈ కోర్సు ఉపాధ్యాయు లకు ఎంతో ఉపయోగపడు తుందని తెలి పారు. రెండ్రోజుల శిక్షణ తర్వాత ఆన్ లైన్ లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.
చదవండి:
ఆంగ్ల భాష ఉచ్ఛారణపై శిక్షణ ప్రారంభం
English Teaching : ‘ఏ టు జెడ్’ పట్టు చిక్కేలా..
నూతన విద్యావిధానంపై కీలక సమావేశం.. ప్రతిరోజూ ఒక కోత్త పదం
Published date : 10 Apr 2022 04:14PM