Skip to main content

Education System: విద్యా వ్యవస్థ దారుణం: వైఎస్‌ జగన్‌

ప్రభుత్వ బడుల్లో టోఫెల్‌ పీరియడ్‌ తీసేశారు. పిల్లలందరూ గొప్పగా ఇంగ్లిష్‌ చదువుకుని ఏకంగా ప్రపంచంతో పోటీ పడేలా చదువుకుంటున్న పరిస్థితులను.. కూటమి ప్రభుత్వం రాగానే నిర్వీర్యం చేస్తున్నారు. ఇంగ్లిష్‌ మీడియం చదువులు అటకెక్కే పరిస్థితి ఉంది.
YS Jagan Mohan Reddy  TOEFL period removal government schools Impact of TOEFL removal on education

విద్యాకానుక పంపిణీ కూడా అస్తవ్యస్తం. ట్యాబ్‌లు ఇస్తారన్న నమ్మకం లేదు. గోరుముద్ద (మధ్యాహ్న భోజనం) మెనూ కూడా అస్తవ్యస్తంగా మారింది. ఆరోగ్యశ్రీ కింద ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఇప్పటికే రూ.1600 కోట్ల బకాయిలు ఉన్నాయి. 

చదవండి: School Uniforms: నెల రోజులు గడుస్తున్నా యూనిఫాంను అందించలేదు

మార్చిలో ఎన్నికల కోడ్‌ రావడంతో.. బిల్లులు ఆపాల్సి వచ్చింది. కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యశ్రీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పరిపాలన, ఇంటికే అందే డెలివరీ మెకాని­జమ్‌తో పాటు, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.

ఏకంగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. కక్షలు తీర్చు­కునే వారిని ప్రోత్సహించేలా చంద్రబాబు తీరు ఉంది. ఈ మోసాలు చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోంది.

Published date : 14 Aug 2024 12:49PM

Photo Stories