భూపాలపల్లి అర్బన్: జిల్లాలో జరుగుతున్న ఎస్‌ఏ–1 పరీక్షలను జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాంకుమార్, జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి ఒంటేరు చంద్రశేఖర్ అక్టోబర్ 5న పరిశీలించారు.
పరీక్షలను పరిశీలించిన డీఈఓ
జిల్లాకేంద్రంలోని పలు ప్రభుత్వ. ప్రైవేట్ పాఠశాలలను సందర్శించిన అనంతరం డీఈఓ రాంకుమార్ మాట్లాడారు. టైం టేబుల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలని చెప్పారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రధానంగా ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వారితో పాటు డీసీఈబీ సహాయ కార్యదర్శి శనిగరపు భద్రయ్య ఉన్నారు.