ఐదో తరగతి ప్రవేశాల గడువు ఇదే..
Sakshi Education
సంక్షేమ గురుకుల పాఠశా లల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు అర్హత సాదించిన విద్యార్థులు జూలై 5వ తేదీ నాటికి నిర్దే శించిన పాఠశాలలో రిపోర్టు చేయాలని టీజీ సెట్–22 కన్వీనర్ రోనాల్డ్‌రాస్ జూన్ 29న ఒక ప్రకటనలో కోరారు.
వాస్తవానికి రిపోర్టు చేసే గడువును ఈనెల 29 వరకే నిర్ణయిం చినప్పటి కీ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన వినతుల దృష్ట్యా గడువును వారం పాటు పొడి గించినట్లు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థు లు తప్పకుండా జూలై ఐదో తేదీ నాటికి సం బంధిత పాఠశాలలో ధ్రువపత్రాలు సమర్పిం చి రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. ఏవైనా సందేహాలుంటే 180042545678 టోల్ ఫ్రీ నం బర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.
Published date : 30 Jun 2022 04:26PM