Skip to main content

Telangana: చదువు సాఫీగా సాగేలా ప్రతిరోజూ పర్యవేక్షణ

జిల్లాలోని 118 మంది సీఆర్పీలు, 26 మంది ఐఈఆర్పీలు తమ కాంప్లెక్స్‌ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు.
Daily monitoring to ensure smooth progress of studies  Inclusive Education Resource Persons (IERPs) working on a comprehensive survey in district villages

ఓఎస్‌సీ (ఔట్‌ ఆఫ్‌ స్కూల్‌ చిల్డ్రన్‌) పేరిట నిర్వహించే సర్వే ద్వారా 6, 14 ఏళ్ల పిల్లలను, అదే విధంగా కళాశాల స్థాయిలో 15, 19 ఏళ్ల పిల్లలను వేర్వేరుగా గుర్తించి, వివరాలను ప్రబంద్‌ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు.

పిల్లలు, విద్యార్థులకు అవగాహన కల్పించి పాఠశాలల్లో చే ర్పించాలి. అలాగే వేరే రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం ఇక్కడికొచ్చి పని చేసుకుంటున్న వారి పిల్లల వివరాలు సేకరించాలి. డ్రాప్‌ బాక్స్‌లోని విద్యార్థులు ప్రస్తుతం ఏ పాఠశాలలో చదువుతున్నారో సమాచారం సేకరించాలి. పక్క రాష్ట్రాల్లో ఉండి ప్రస్తుతం సొంత ప్రదేశాలకు వచ్చిన విద్యార్థులను గుర్తించాల్సి ఉంటుంది.

చదవండి: ‘NAAC’ బృందం డిగ్రీ కళాశాల సందర్శన

ప్రతిరోజూ పర్యవేక్షణ

జిల్లాలోని 85 పాఠశాలల కాంప్లెక్స్‌ పరిధిలో జరుగుతున్న సర్వేను కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, సంబంధిత గ్రామాల్లో జరుగుతున్న సర్వేను పాఠశాల హెచ్‌ఎం నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే మండలంలో మండల విద్యాశాఖ అధికారి ప్రతీ కాంప్లెక్స్‌ పరిధిలోని ఒక గ్రామంలో జరిగే సర్వేను పర్యవేక్షించి అప్పటివరకు సేకరించిన సమాచారంపై సమీక్ష నిర్వహించాలి.

అలాగే జనవరి 11న మండల స్థాయి బడిబయట సర్వే రిపోర్టును జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలి. జిల్లా స్థాయిలో పరిశీలించిన బడి బయట పిల్లల వివరాలను జనవరి 12న జిల్లా విద్యాశాఖ అధికారి ధ్రువీకరించి రాష్ట్రస్థాయికి పంపిస్తారు.

చదవండి: Earth Foundation: కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు
‘అందరూ చదవాలి..అందరూ ఎదగాలి’ అనే లక్ష్యంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం.. బడి బయట పిల్లల గుర్తింపు సర్వేకు శ్రీకారం చుట్టింది. బడి బయట, మధ్యలో చదువు మానేసిన పిల్లలను గుర్తించడమే కార్యక్రమం లక్ష్యం.

పాఠశాలలకు రాని బడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేందుకు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సోమవారం ప్రారంభమైన సర్వే జనవరి 11 వరకు కొనసాగనుంది.

పకడ్బందీగా నిర్వహిస్తాం

అందరికీ విద్య అందించాలన్నదే సర్వే లక్ష్యం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పకడ్బందీగా సర్వే నిర్వహిస్తాం. సీఆర్పీలు క్షేత్రస్థాయిలో వెళ్లి సమాచారాన్ని సేకరిస్తారు. బడీడు పిల్లల వివరాలను ప్రబంద్‌ పోర్టల్‌లో నమోదు చేస్తాం. జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు కృషి చేస్తున్నాం. సర్వేలో గుర్తించిన పిల్లలు తిరిగి చదువుకునేలా చర్యలు తీసుకుంటాం.
– వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి.

sakshi education whatsapp channel image link

Published date : 15 Dec 2023 01:07PM

Photo Stories