‘NAAC’ బృందం డిగ్రీ కళాశాల సందర్శన
రెండు రోజులపాటు ఇక్కడ విద్యా ప్రమాణాలను, మౌలిక సదుపాయాలను, అధ్యాపక సిబ్బందిని, తదితర అంశాల వారీగా పరిశీలించింది. నాక్ కోర్ టీం చైర్మన్, మాజీ వైస్ చాన్సలర్ ముజాహిల్ కిద్వాయ్, మెంబర్ కోఆర్డినేటర్ పంచాంగదాస్, సభ్యురాలు దీపాన్విత చక్రవర్తిల బృందం కళాశాలకు నాక్ అక్రిడిటేషన్ కల్పించేందుకు గల అవకాశాలను శాఖల వారీ పరిశీలించింది.
చదవండి: NAAC At AU: వర్సిటీలో నాక్ కమిటీ సందర్శన
విద్యార్థులను, పూర్వ విద్యార్థులను కలసి పలు వివరాలు సేకరించింది. పూర్వపు ప్రిన్సిపాల్ కె.రామచంద్రరావు ఈ మేరకు గతంలో చేసిన సూచనల ప్రకారం ప్రిన్సిపాల్ టి.రాధాకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ పి.కిరణ్‌కుమార్, ఇతర అధ్యాపక సిబ్బంది నాక్ బృందానికి కళాశాల గురించి వివరాలను అందజేశారు.
ఎన్‌ఎస్‌ఎస్ మూడు యూనిట్ల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు నాక్ బృందం తిలకించింది. నాక్ బృందం సంతృప్తి చెంది నాక్ అక్రిడిటేషన్‌కు అనుమతిస్తే 41 ఏళ్ల క్రితం స్థాపించబడిన కళాశాలకు మరింత వన్నె తెస్తుందని చెప్పవచ్చు.