Skip to main content

School Admissions: స్పోర్ట్స్‌ స్కూళ్లలో ప్రవేశాలకు పోటీలు

పాల్వంచ రూరల్‌: ఉమ్మడి జిల్లా పరిధి కిన్నెరసాని బాలుర, కాచనపల్లి బాలికల క్రీడాపాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు తుది దశ ఎంపిక పోటీలు పాల్వంచ మండలం కిన్నెరసాని క్రీడాపాఠశాల మైదానంలో మార్చి 26న‌ ప్రారంభమయ్యాయి.
Palvancha Rural Sports School selection event  Competitions for admissions in sports schools   Admissions selection for Kinnerasani Boys and Kachanapally Girls Sports Schools

రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలను ఐటీడీఏ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ బొల్లి గోపాల్‌రావు ప్రారంభించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారికి ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పించనుండగా, 110 మంది విద్యార్థులు హాజరయ్యారని క్రీడల అధికారి తెలిపారు.

చదవండి: KGBV Admissions 2024: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

ఇంకా ఈ కార్యక్రమంలో అధికారులు, పీడీలు కొమరం వెంకటనారాయణ, బుగ్గ వెంకటేశ్వర్లు, అన్నం వెంకటేశ్వర్లు, రాంబాబు, కె.వెంకటేశ్వర్లు, నర్సయ్య, రామారావు, మోతీలాల్‌, కృష్ణ, డి.శిరోమణి, హతీరామ్‌, రవి, ముత్తయ్య, రాంబాబు, నాగరాజు పాల్గొన్నారు.

Published date : 27 Mar 2024 03:32PM

Photo Stories