Department of Education: విద్యార్థులకు అల్పాహారం
ప్రభత్వ పాఠశాలల్లో చదివే ఏ విద్యార్థి కూడా ఆకలితో బడికి రావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన టిఫిన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 24న ప్రారంభించాలని ప్రభుత్వం భావించినా.. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉండటంతో పథాకానికి ఆటంకం కలుగకుండా అక్టోబర్ 6న ఈ పథకాన్ని ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు. అందు కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఒక్కో పాఠశాల చొప్పున 14 పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు. వీటిలో అక్టోబర్ 6న ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు.
చదవండి: ITDA PO Ankit: కమ్యూనికేషన్ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వాలి
ఇటీవల ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో ఉదయం విద్యార్థులకు రాగి అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్ని వారంలో మూడు రోజులు అందిస్తున్నారు. కాగా కొన్ని సంవత్సరాలుగా అన్ని తరగతుల వారికి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. తాజాగా టిఫిన్లు పెట్టడం పాఠశాలల్లో కొత్త మైలు రాయిని చేరుకోనున్నట్లు పలువురు హర్షిస్తున్నారు.
చదవండి: Dr Beeraiah Baire: ఐఐటీ జామ్‌కు సన్నద్ధం కావాలి
ఎవరికి అప్పగిస్తారో..
ఈ పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో 3,170 ప్రభుత్వ పాఠశాలల్లో 2.80లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం పొందనున్నారు. టిఫిన్ల పంపిణీని ఎవరికి అప్పగిస్తారనే అంశంలో కొంత సందిగ్ధత నెలకొంది. కొన్ని మండలాల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు భోజనం పెట్టగా.. కొన్ని మండలాల్లో అక్షయపాత్ర ద్వారా భోజనం పెడుతున్నారు. వీటిలో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారు? లేదా మధ్యాహ్నం భోజనం తరాహార అలాగే టిఫిన్లు కూడా కొనసాగిస్తారా.. అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
నియోజకవర్గానికి ఒక పాఠశాల..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ప్రతి మున్సిపాలిటీలో ఒకటి చొప్పున 14 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లాలో 3 నియోజవర్గాలు ఉంటే దేవకద్రలో కోడ్గల్ హైస్కూల్, దేవరకద్రలో బాలికల హైస్కూల్, మహబూబ్‌నగర్‌లో మాడల్ బేసిక పాఠశాల, నారాయణపేట్ గ్రౌండ్ హైస్కూల్, మక్తల్‌లో జెడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్ బాయ్స్, కాగా నాగర్‌కర్నూల్‌లో పీఎస్ సంజయ్‌నగర్, కల్వకుర్తిలో పీఎస్ వెల్దండ, కొల్లాపూర్‌లో పీఎస్ కొండూరు, అచ్చంపేటలో జెడ్పీహెచ్‌ఎస్ గర్‌ల్స్ స్కూల్, గద్వాల జిల్లాలో ఆలంపూర్‌లో జెడ్పీహెచ్‌ఎస్ దార్మారం, గద్వాలలో జ్పెడ్పీహెచ్‌ఎస్ వీరాపురంలో పథకాన్ని ప్రారంభించనున్నారు.