ITDA PO Ankit: కమ్యూనికేషన్ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వాలి
Sakshi Education
ఏటూరునాగారం: యువతీ యువకులకు స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంశాలపై ఎక్కువ శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఐటీడీఏ పీఓ అంకిత్ తెలిపారు.
కమ్యూనికేషన్ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వాలి
మండల కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌ను ఐటీడీఏ పీఓ అక్టోబర్ 4న ఆకస్మికంగా పరిశీలించారు. ఆయా విభాగాల్లో శిక్షణ పొందుతున్న వారి వివరాలను ఫ్యాకల్టీ ద్వారా అడిగి తెలుసుకున్నారు. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుపై ఎంతమంది సిబ్బంది శిక్షణ ఇస్తున్నారని ప్రశ్నించారు. శిక్షణ అనంతరం కల్పిస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కంప్యూటర్, ల్యాబ్, డైనింగ్ హాల్ పరిశీలించిన అనంతరం యువతీ యువకులు ఏ గ్రామాల నుంచి వచ్చారని వారు ఎంతవరకు చదువుకొని ఉన్నారని ఫ్యాకల్టీని ప్రశ్నించారు. యువతీ యువకులు ఉపాధి పొందే వరకు వారిని అధ్యాపకులు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, జేడీఎం కొండల్‌రావు తదితరులు పాల్గొన్నారు.