Skip to main content

TOSS: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌కు దరఖాస్తు చేసుకోండి

శాంతినగర్‌: చదువుకు దూరమై 14ఏళ్లు నిండిన వారు ఓపెన్‌ టెన్త్‌, పదో తరగతి పూర్తయిన వారు ఓపెన్‌ ఇంటర్‌కు దరఖాస్తు చేసుకోవాలని శాంతినగర్‌ కోఆర్డినేటర్‌ బి.నరసింహ, సహాయ కోఆర్డినేటర్‌ కమతం శేషన్‌ ఆగ‌స్టు 2న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Apply for Open Tenth and Inter
ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌కు దరఖాస్తు చేసుకోండి

నిరుద్యోగులు, మహిళలకు ఇది సువర్ణావకాశమని, సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉందని, మరిన్ని వివరాలకు సెల్‌ నం.9885994554లో సంప్రదించాలని పేర్కొన్నారు.

చదవండి: TS Open Schools: ఓపెన్‌ స్కూల్‌ ఓ వరం

గడువు పొడిగింపు

గద్వాల అర్బన్‌: డిస్ట్రిక్‌ హబ్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ విభాగంలో అకౌంట్స్‌ అసిస్టెంట్‌ పోస్టుకు దరఖాస్తు గడువును పొడగించినట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి ముషాహిదా బేగం ఆగ‌స్టు 2న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

డిగ్రీలో అకౌంట్స్‌ సబ్జెక్టు పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నామని, ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్ధల్లో కనీసం మూడేళ్లు పని చేసిన అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఆగ‌స్టు 4న తేదీన సాయంత్రం 5గంటలలోగా జిల్లా కార్యాలయం, ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్‌ కాంప్లెక్స్‌లో విద్యార్హత, అనుభవం సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Published date : 03 Aug 2023 03:28PM

Photo Stories