Skip to main content

Model Schools: కారుణ్య నియామకాలకు విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: Model Schools ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలు చేపట్టాలని మంత్రి హరీశ్‌రావుకు తెలంగాణ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భూతం యాకమల్లు విజ్ఞప్తి చేశారు.
Model Schools
మోడల్‌ స్కూల్స్‌ కారుణ్య నియామకాలకు విజ్ఞప్తి

ఈ మేరకు వినతి పత్రం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మరణించిన 27 మంది టీచర్ల కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. మోడల్‌ స్కూల్‌ టీచర్లకు హెల్త్‌ కార్డులివ్వాలని, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ మంజూరు చేయాలని ఆయన కోరారు.

చదవండి: School Education Department: ప్రిన్సిపాల్స్‌కు పే ప్రొటెక్షన్‌

ఈ స్పెషల్‌ ఆఫీసర్లకు మోడల్‌ స్కూల్‌ హాస్టళ్ల బాధ్యతలు

రాష్ట్రంలో మోడల్‌ స్కూళ్లకు సంబంధించిన బాలికల హాస్టళ్ల నిర్వహణ బాధ్యతను కస్తూర్బా బాలికా విద్యాలయ ప్రత్యేక అధికారులకు అప్ప గించారు.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సమీపంలోని కేజీబీవీల అధికారులే తాత్కాలికంగా మోడల్‌ స్కూల్స్‌ బాలికల హాస్టళ్ల బాధ్యతలను చూడాలని పేర్కొంది. ఇప్పటి వరకూ వీటి నిర్వహణను మోడల్‌ స్కూల్స్‌ ప్రిన్సిపాళ్లు చూసేవారు. అయితే, తమ జాబ్‌చార్ట్‌లో ఈ విధుల్లేవని, అయినా తమకు అప్పగించడం సరికాదని ప్రిన్సిపాళ్లు కోర్టును ఆశ్రయించారు.

చదవండి: ప్రభుత్వ పాఠశాల‌లో ఐఏఎస్‌ అధికారి పిల్లలు..

న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు చెప్పటంతో విద్యా శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేజీబీవీల్లో ఉన్నవారంతా తా త్కాలిక ఉద్యోగులేనని, ఏ చిన్న తప్పు జరిగినా వారిని ఉద్యోగాల నుంచి తొలగించే పరిస్థితి ఎదురవుతుందని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె. జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి జూలై 27న ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. 

Published date : 15 Nov 2022 01:17PM

Photo Stories