Teacher Transfers: ఈ జిల్లాలో బదిలీలకు 2,354 దరఖాస్తులు
Sakshi Education
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో బదిలీల కోసం ఆన్‌లైన్‌లో 2,354 దరఖాస్తులు వచ్చినట్లు డీఈఓ రామారావు సెప్టెంబర్ 7నతెలిపారు.
దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు ఎంఈఓల ద్వారా హార్డ్ కాపీలను అందించారన్నారు. సెప్టెంబర్ 8, 9వ తేదీల్లో తాత్కాలిక సీనియార్టీ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ప్రధానోపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులు, అనంతరం పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు.
చదవండి: TS DSC 2023 Notification: తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ప్రస్తుతం జిల్లాలో 3,088 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తాజాగా నిర్ణయించిన కటాఫ్ తేదీ ప్రకారం ఒకేచోట ఐదేళ్లు పూర్తయిన ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు చాలామంది ఉన్నారని, వారందరికీ తప్పక బదిలీ అవుతుందన్నారు.
Published date : 08 Sep 2023 03:09PM