10th Hall tickets తిప్పలు: ఆమోదం పొందని కొన్ని నామినల్ రోల్స్
- ఆమోదం పొందని కొన్ని నామినల్ రోల్స్
- ఈటీఆర్ లేక జారీకి నోచుకోని వైనం
సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నా.. కొన్ని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ కాకపోవడంతో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే హాల్ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం కాగా, రెన్యువల్స్ లేని పాఠశాలల నామినల్ రోల్స్ ఆమోదం పొందక వీటి జారీ పెండింగ్‌లో పడిపోయాయి. దీంతో ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు ప్రత్యేక అనుమతి కోసం ఉరుకులు పరుగులు తీస్తున్నారు. కరోనా నేపథ్యంలో 2021– 22 విద్యా సంవత్సరానికి ఈటీఆర్‌తో సంబంధం లేకుండా ప్రత్యేక అనుమతితో నామినల్ రోల్స్ ఆమోదించాలన్న నిబంధన కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు ఉపశమనం కలిగిస్తోంది.
Also read: Bendapudi High School Students: విద్యార్థులతో ముచ్చటించిన సీఎం జగన్.. వీళ్ల ప్రతిభని చూసి..
దాదాపు 20 శాతం పైనే..
గ్రేటర్ పరిధిలో కరోనా నేపథ్యంలో బడ్జెట్, ఇతరత్రా బడులు సుమారు 20 శాతం పైగా మూతపడటం, ఇతరులకు బదిలీ చేయడం వంటి ఘటలు చోటు చేసుకున్నాయి. కొన్ని టెక్నో స్కూళ్లు ఇదే బాటలో నడిచాయి. ఫలితంగా సుమారు 200కుపైగా పాఠశాలల విద్యార్థులకు పదో తరగతి హాల్ టికెట్ సమస్య తలెత్తింది. వాస్తవంగా ప్రైవేట్ పాఠశాలలు రెండేళ్లకోసారి తమ గుర్తింపును పొడిగించుకోవాలి. ఇందుకోసం ఎక్స్‌టెన్షన్ ఆఫ్ టెంపరరీ రికగ్నైజేషన్ (ఈటీఆర్) కోసం జిల్లా విద్యాశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం భవనం, అగి్నమాపక, వాటర్‌బోర్డుతో పాటు 23 శాఖల అనుమతి పత్రాల దరఖాస్తు వెంట జతపర్చాలి. విద్యాశాఖ అధికారులు పరిశీలన తర్వాత ఈటీఆర్ జారీ చేస్తుంది. మూతబడిన పాఠశాలల్లోని విద్యార్థులను కొంతమంది ఇతర స్కూళ్లకు బదిలీ చేయగా, మరికొందరు ఈటీఆర్ అనుమతులు తీసుకోకుండానే పాఠశాలల్లో చదువులు కొనసాగించారు. ఈటీఆర్ లేకపోవడంతో ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు హాల్ టికెట్ జారీకి ఆటంకాలు ఏర్పడ్డాయి.
Also read: పాఠశాల మ్యాగజైన్ తో సృజనాత్మక శక్తి వృద్ధి
ప్రత్యేక అనుమతికి వినతి..
కరోనా నేపథ్యంలో రెన్యువల్‌కు మినహాయింపుపై ప్రైవేటు పాఠశాలు ఆశలు పెట్టుకున్నాయి. ఈటీఆర్ చేయించుకునేందుకు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పాఠశాలల ఆర్థిక పరిస్థితులు, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నామినల్ రోల్స్‌ను ఆమోదించాలని విజ్ఞప్తి
చేస్తున్నారు.
Also read : Tenth Class: విద్యార్థులకు నిజంగా ‘పరీక్షే’..! కేంద్రాల్లో ఏదో ఒక సమస్య