Skip to main content

ఐదేళ్లలో 100% పరిజ్ఞానం!

ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థి చదివే, రాసే సామర్థ్యాన్ని ఇకపై వారానికోసారి అంచనా వేయ బోతున్నారు.
100percent education knowledge in five years
ఐదేళ్లలో 100% పరిజ్ఞానం!

అభ్యసన సామర్థ్యాలపై ప్రతి నెలా రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేపట్టబోతున్నారు. ముఖ్యంగా భాష, గణితంపై దృష్టి పెట్టనున్నారు. తద్వారా వచ్చే ఐదేళ్లలో 3, 5 తరగతుల విద్యార్థుల్లో 100% తెలివి తేటలు (పరిజ్ఞానం) పెంచాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ లక్ష్యంగా పెట్టు కుంది. అలాగే 8వ తరగతి విద్యార్థుల్లో ప్రస్తుత సామర్థ్యాని 85 శాతానికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘తొలిమె ట్టు’ కార్యక్రమానికి ఆగస్టు 15 నుంచి శ్రీకారం చుట్టింది. దీనికోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. 1–5 తరగ తుల విద్యార్థుల కోసం తొలిమెట్టు అమలు చేయబోతు న్నారు. దీంతో పాటే 6–10 తరగతుల విద్యార్థుల అభ్యసన నష్టాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. 

చదవండి: అన్ని పాఠ‌శాల‌ల‌కు ఇంటర్నెట్‌.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను..

‘న్యాస్‌’ రిపోర్టుతో మేల్కొలుపు

అన్ని రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాలపై National Achievement Survey (NAS) ప్రతి రెండేళ్ళకోసారి సర్వే నిర్వహిస్తుంది. సర్వేలో భాగంగా విద్యార్థులకు పలు ప్రశ్నలు వేయడం ద్వారా వారి స్థాయిని అంచనా వేస్తుంది. గత ఏడాది నవంబర్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేసి, ఫలితాలు వెల్లడించింది. కరోనా కారణంగా రెండేళ్ళలో విద్యా ప్రమాణాలు అనూహ్యంగా తగ్గాయని తాజా నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ కార్యాచరణకు దిగింది. పాఠశాలల ప్రారంభంలోనే విద్యార్థులకు బ్రిడ్జ్‌ కోర్సు నిర్వహించింది. దీనికి కొనసాగింపుగా 1–5 తరగతులకు తొలిమెట్టు, 6–10 తరగతుల్లో అభ్యసన నష్టాల భర్తీకి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

చదవండి:  ప్రప్రథమ టీచింగ్‌ రోబో ‘ఈగిల్‌’

వారం వారం అంచనా...

విద్యార్థులకు వారంలో ఐదు రోజుల పాటు రెగ్యులర్‌ క్లాసులు జరుగుతాయి. అదనంగా ఓ గంట తొలిమెట్టు కింద ప్రత్యేక క్లాసు తీసుకుంటారు. విద్యార్థి వెనుకబడిన సబ్జెక్టు, పాఠాన్ని అర్థమయ్యేలా మళ్ళీ బోధిస్తారు. వారికి అర్థమైందా లేదా అనే దానిపై పాఠశాల స్థాయిలో చిన్న పరీక్ష నిర్వహిస్తారు. ఇది రాత పూర్వకంగా లేదా మౌఖికంగానైనా ఉండొచ్చు. ఒక పాఠం కనీసం 80 శాతం మందికి అర్థమవ్వాలని తొలిమెట్టు ప్రణాళికలో పేర్కొన్నారు. ఉన్నత తరగతుల విద్యార్థులకూ ఇదే విధానాన్ని అమలు చేస్తారు. 

చదవండి:  Eagle: మరబొమ్మ సాక్షాత్‌.. గురు బ్రహ్మ..

వచ్చే ఐదేళ్ళలో విద్యార్థుల పరిజ్ఞానం పెంపు లక్ష్యం దశలవారీగా (శాతాల్లో)

సంవత్సరం

3వ తరగతి

5వ తరగతి

8వ తరగతి

 

భాష

గణితం

భాష

గణితం

భాష

గణితం

ప్రస్తుతం

68

69

57

56

53

37

2022–23

80

79

75

75

70

70

2023–24

85

85

80

80

75

75

2024–25

90

90

90

90

80

80

2025–26

100

100

100

100

85

85

Published date : 16 Aug 2022 03:12PM

Photo Stories