Skip to main content

AP CM Jagan Mohan Reddy : అన్ని పాఠ‌శాల‌ల‌కు ఇంటర్నెట్‌.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖపై సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆగ‌స్టు 12వ తేదీన నిర్వహించిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ మేరకు స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం జగన్‌ ఆదేశించారు.
AP CM YS Jagan Mohan Reddy
AP CM YS Jagan Mohan Reddy

స్కూళ్లకు ఎలాంటి మరమ్మత్తు వచ్చినా వెంటనే బాగు చేసే విధానం ఉండాలన్నారు. అదే సమయంలో అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Jagananna Vidya Deevena : 11.02 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన.. ఈ సారి విద్యార్థుల‌కు..

ట్యాబులను వెంటనే.. 
వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్‌ చివరి నాటికే సిద్ధం చేయాలన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను వెంటనే ప్రొక్యూర్‌ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోధన కోసం టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలని, దశలవారీగా డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ సూచించారు.

ఇంకా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

  • నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లలో నిర్వహణ బాగుండాలి, దీనికోసం ఎస్‌ఓపీలను రూపొందించాలి
  • ఒక ప్రత్యేక అధికారికి స్కూళ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించండి
  • స్కూళ్లకు కల్పించిన సౌకర్యాల నిర్వహణ విషయంలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు నిర్వహించేలా విధానం ఉండాలి 
  • వచ్చే సమీక్షా సమావేశం నాటికి దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలన్న సీఎం
  • ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించాలని సీఎం ఆదేశాలు
  • అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలన్న సీఎం
  • అత్యుత్తమ బోధనకు ఇది దోహదపడుతుందన్న సీఎం
  • స్కూళ్లకు కాంపౌండ్‌ వాల్స్‌ తప్పనిసరిగా ఉండాలి, వీటిపై దృష్టిపెట్టాలి

జగనన్న విద్యా కానుకపై సీఎం సమీక్ష ..

  • వచ్చే ఏడాది విద్యాకానుకకు సంబంధించి ఇప్పటినుంచే అన్నిరకాలుగా సిద్ధంకావాలని సీఎం ఆదేశాలు
  • ఏప్రిల్‌ నాటికే విద్యా కానుక కింద అందించే వాటిని సిద్ధంచేసుకోవాలన్న సీఎం
  • సమావేశంలో పిల్లలకు అందిస్తున్న యూనిఫామ్‌ నాణ్యతను పరిశీలించిన సీఎం.

ట్యాబ్‌ల పంపిణీపైనా సమీక్ష..

  • 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించే కార్యక్రమంపైనా సీఎం సమీక్ష
  • టెండర్లు ఖరారుచేసి వెంటనే ఆర్డర్‌ ఇవ్వాలని సీఎం ఆదేశం

తరగతి గదుల డిజిటలైజేషన్‌మీద సీఎం సమీక్ష..

  • స్మార్ట్‌ టీవీ లేదా ఇంటరాక్టివ్‌ టీవీ ఏర్పాటుపైనా సీఎం సమీక్ష
  • ప్రతి తరగతి గదిలోనూ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం ఆదేశం
  • పాఠ్యపుస్తకాలకు సంబంధించిన కంటెంట్‌ను అందరికీ అందుబాటులో పెట్టండి 
  • పీడీఎఫ్‌ ఫైల్స్‌ రూపంలో అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి
  • దీనివల్ల లిబరల్‌గా అందరికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయి
  • అంతేకాక ప్రభుత్వేతర స్కూళ్లు ఎవరైనా ప్రభుత్వ ముద్రణా సంస్థ నుంచి పాఠ్యపుస్తకాలు కావాలనుకుంటే.. నిర్ణీత తేదీలోగా ఎన్ని పుస్తకాలు కావాలో వివరాలు తీసుకుని ఆమేరకు వాటిని అందించండి
  • ఎక్కడా కూడా పాఠ్యపుస్తకాల కొరత అనేది ఉండకూడదు
  • అధికారులకు స్పష్టం చేసిన సీఎం

బాలికల భద్రతపై అవగాహన..

  • రక్షణ, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై స్కూళ్లలో విద్యార్థినులకు సరైన అవగాహన కల్పించాలన్న సీఎం జగన్‌
  • గ్రామ సచివాలయం నుంచి మహిళా పోలీసు, ఏఎన్‌ఎం తరచుగా వీరిని కలిసి అవగాహన కల్పించాలన్న సీఎం జగన్‌
  • విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక మహిళా ఉపాధ్యాయురాలిని కౌన్సెలింగ్ ‌కోసం నియమించాలన్న సీఎం జగన్‌

AP CM Jagan Mohan Reddy : విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీపై సీఎం జగన్‌ ఏమన్నారంటే..

AP CM Jagan Mohan Reddy : హాస్టళ్లకు కొత్తరూపు.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Published date : 12 Aug 2022 04:57PM

Photo Stories