Skip to main content

Jagananna Vidya Deevena : 11.02 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన.. ఈ సారి విద్యార్థుల‌కు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పేద కుటుంబాల్లోని విద్యార్థులంతా ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును అమలు చేస్తూ ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు రూ.11,715 కోట్లు అందించింది.
Jagananna Vidya Deevena  2022
Jagananna Vidya Deevena

పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు అండగా నిలుస్తోంది.

కాలేజీలకు వారు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం అదనంగా రూ.20 వేల వరకు ప్రభుత్వం ఇస్తోంది. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రూ.694 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ‌స్టు 11వ తేదీన (గురువారం) విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. బాపట్లలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. తద్వారా 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది.

రాష్ట్రంలోని ప్రతి బిడ్డ చదువుకోవాలన్నదే నా ల‌క్ష్యం..
పెద్ద చదువులు కూడా పేదలకు హక్కుగా మార్చాం. పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్తి నాణ్యమైన చదువే. ప్రపంచంతో పోటీ పడే విధంగా పిల్లలకు శిక్షణ అందిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ చదువుకోవాలన్నదే నా ఆకాంక్ష. విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చాం. కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరినీ చదివించండి. ప్రతి ఇంటి నుంచి ఇంజినీర్లు, డాక్టర్లు, ఐపీఎస్‌లు రావాలి. మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది అని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు.

ఫీజు ఎంతైనా ప్రభుత్వమే..
పిల్లలకు మనమిచ్చే విలువైన ఆస్తి చదువు. విద్యార్థుల ఫీజు ఎంతైనా కూడా మొత్తం ప్రభుత్వాన్నే భరిస్తుంది. అందులో భాగంగానే ప్రతి విద్యార్థికి 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మూడో విడత జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేస్తున్నాం. రూ.694 కోట్లను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఏప్రిల్‌-జూన్‌ 2022 కాలానికి గానూ, 11.02 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్‌ అన్నారు.

మూడేళ్లలో రూ.53వేల కోట్లు..

చదువుల కోసం ఏ కుటుంబం అప్పుల పాటు కాకూడదు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం చెల్లించాం. పిల్లల శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్నాం. అమ్మఒడి, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, మనబడి నాడు-నేడు, ఇంగ్లీష్‌ మీడియం, బైజ్యూస్‌తో ఒప్పందం ఇలా విద్యారంగంపై మూడేళ్లలో రూ.53వేల కోట్లు ఖర్చుపెట్టాం. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం.

ఇంకా సీఎం జగన్‌ ఏమన్నారంటే..?
☛ పదేళ్ల కిందట ఎలాంటి ప్రపంచం ఉండేది
☛ 20 ఏళ్ల తర్వాత మన బ్రతుకులు ఎలా ఉంటాయి.. అంటే.. ఊహకందని విషయం
☛ అంత వేగంగా మార్పులు వస్తున్నాయి
☛ ఆ మార్పులతో మనం ప్రయాణం చేయాలి
☛ లేకపోతే మన పిల్లలు ప్రపంచంతో పోటీపడలేరు
☛ అందుకనే ప్రతి అడుగులోనూ మార్పు కనిపించాలి
☛ అప్పుడే గొప్ప మార్పులు సాధ్యమవుతాయి
☛ అలాంటి చదువులు రాష్ట్రంలో ప్రతి బిడ్డకూ అందాలి
☛ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర కులాల్లోని పేద కుటుంబాలకు చెందిన బిడ్డలు, నా బిడ్డలు పెద్ద చదువులు చదువుకోవాలి

☛ మీ అందరి అన్నగా దీన్ని కోరుకుంటూ 3 ఏళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం
☛ అందులో భాగంగానే ప్రాథమిక విద్యలోనే కాకుండాపెద్ద చదువులను కూడా పేదలకు అందుబాటులోకి తీసుకువస్తూ 100 శాతం ఫీజు రియింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నాం
☛ ఫీజులు ఎంతైనా ప్రభుత్వమే చెల్లిస్తోంది
☛ మీరు వెళ్లండి.. చదవండి.. ఎంతమంది బిడ్డలు ఉంటే.. అంతమందిని చదివిస్తాను అని సగర్వంగా తెలియజేస్తున్నాను

☛ రేషన్‌లా ఆలోచించి ఒక్కరికే కాదు.. అందరికీ అందిస్తాం
☛ చదివినప్పుడే మన బతుకులు, తలరాతలు మారుతాయి
☛ ఏ ఒక్క రాష్ట్రంలో లేని విధంగా ఈ పథకం మన రాష్ట్రంలో అమలవుతుంది
☛ తల రాతలు మార్చాలన్న ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది
☛ ప్రతి తల్లి, తండ్రి కూడా ఖర్చుకు వెనకాడకుండా.. మీ బిడ్డలను బాగా చదివించండి
☛ ఎంత మంది బిడ్డలు ఉన్నా.. చదివించండి.. తోడుగా మీ అన్న, తమ్ముడైన నేను ఉంటాను
☛ ఆ బాధ్యత నేను తీసుకున్నాను
☛ ప్రతి ఇంట్లోని నుంచి ప్రతి డాక్టర్, ఇంజినీర్, కలెక్టర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు చదువుకునే నా బిడ్డలు బయటకు రావాలి

☛ 2017-18, 2018-19 సంవత్సరాలకు ఫీజు రియింబర్స్‌మెంట్‌బకాయిలను రూ.1778 కోట్లను నేను కట్టాను
☛ మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కట్టాను
☛ జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన పథకాలకే ఈరెండు సంవత్సరాల కాలంలో రూ.11,715 కోట్లు నా అక్క చెల్లెమ్మలకు మూడేళ్లకాలంలో ఇచ్చాం
☛ పిల్లలను చదివించుకోవడంకోసం అప్పులు పాలు కాకూడదు, పొలాలు అమ్ముకునే పరిస్థితి రాకూడదని గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం
☛ పిల్లల చదువులకు ఏదీ అడ్డంకాకూడదని ఈ కార్యక్రమాలు చేస్తున్నాం

☛ ఒక్క విద్యారంగంలోని అమ్మ ఒడి, సంపూర్ణపోషణ, గోరుముద్ద, విద్యాకానుక, మన బడి నాడు-నేడు, ఇంగ్లిషు మీడియం, బైజూస్‌తో ఒప్పందం ఇవి మాత్రమే కాకుండా హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం
☛ పాఠ్యప్రణాళికలో 30 నుంచి 40 శాతం నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కోసం ఉద్దేశించాం
☛ 10 నెలల ఇంటర్నెషిప్‌ ఏర్పాటు చేశాం
☛ మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాం
☛ విద్యారంగంమీద రూ. 53,338కోట్లు మూడేళ్లకాలంలో పెట్టాం
☛ కాలేజీల్లో చేరుతున్నవారి సంఖ్యను పెంచాలన్నది ఉద్దేశం

☛ 2035 నాటికి 70శాతానికి జీఆర్‌ రేష్యోను పెంచాలన్నది ధ్యేయం
☛ 2018– 19 తో పోలిస్తే 2019–20లో 8.64శాతం పెరిగింది
☛ జాతీయ స్థాయిలో 3.04 శాతం మాత్రమే
☛ ఆడపిల్లలకు సంబంధించి రాష్ట్రంలో జీఈఆర్‌ రేష్యో 11.04శాతం వృద్ధి అయితే దేశవ్యాప్తంగా 2.28 శాతం వృద్ధి మాత్రమే
☛ 2018లో ప్రాథమిక విద్యలో కేంద్ర ప్రభుత్వాల గణాంకాల ప్రకారం... జీఈఆర్‌ రేష్యో 84.48శాతం అయితే, దేశవ్యాప్త సగటు 99శాతం
☛ ఈ లెక్కల ప్రకారం అట్టడుగున ఉన్న రాష్ట్రాలతో పోటీపడింది
☛ ఈ పరిస్థితుల్లో మన పిల్లలు బాగా చదవాలనే ఉద్దేశంతో తల్లులకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని తీసుకు వచ్చాం
 

☛ గతానికి, ఇప్పటికి పాలనలో తేడాను గమనించండి
☛ అప్పుల్లో గ్రోత్‌ రేట్‌ గత పాలనలో 19శాతం సీఏజీఆర్‌ ఉంటే, ఇప్పుడు 15శాతం మాత్రమే ఉంది
☛ అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా గతంతో పోలిస్తే తక్కువ

☛ తేడా ఏంటి.. కేవలం ముఖ్యమంత్రిలో మార్పు
☛ గతంలో వాళ్లు ఎందుకు చేయలేకపోయారు?
☛ మీ అన్న, మీ తమ్ముడు నేరుగా బటన్‌ నొక్కుతున్నాడు, నేరుగా  అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తోంది
☛ ఎక్కడా లంచాలు లేవు, వివక్షలేదు, డీబీటీ ద్వారా పోతుంది
☛ గతంలో జరిగే స్కీం ఏంటి?
♦వారికి లేనివి, నాకు ఉన్నవి.. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు

Published date : 11 Aug 2022 01:18PM

Photo Stories