TS DSC Notification 2023 : బ్రేకింగ్ న్యూస్.. 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతి... ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్నంటే?
డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో 2,575 ఎస్‌జీటీ,1739 స్కూల్ అసిస్టెంట్, భర్తీ చేయనుండగా..మరో వైపు611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఈ టెట్‌లో వచ్చిన మార్కులకు డీఎస్సీలోనూ..
ఇటీవలే టీఎస్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ టెట్‌లో వచ్చిన మార్కులకు డీఎస్సీలోనూ వెయిటేజీ ఉంటుంది. పేపర్-1,2 రెండిట్లోనూ అభ్యర్థులు అర్హత సాధించాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే అభ్యర్థులూ అర్హులే. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
☛ TS TET Paper-1: టెట్ పేపర్-1 పరీక్షలో ఏఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయంటే..?
☛ TS TET Paper-2: టెట్ పేపర్-2 పరీక్షలో ఏఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయంటే..?
టెట్‌లో నాలుగు లక్షల మందికి పైగా అర్హత.. కానీ
రాష్ట్ర ప్రభుత్వం 2016 నుంచి ఇప్పటివరకు మూడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లు నిర్వహించింది. 2016, 2017ల్లో నిర్వహించిన టెట్‌లలో రెండు లక్షల మందికి పైగా ఉత్తీర్ణులయ్యారు. తాజాగా 2022 జూన్‌లో నిర్వహించిన టెట్‌లో మరో రెండు లక్షల మందికి పైగా ఉత్తీర్ణులయ్యారు. మూడు పరీక్షల్లో నాలుగు లక్షల మందికి పైగా అర్హత సాధించినా ఇప్పటివరకు ప్రయోజనం లేకుండా పోయింది. ఏడేళ్లుగా ఎదురుచూపులే మిగులుతున్నాయని టెట్ ఉత్తీర్ణులు వాపోతున్నారు.
☛ ఇవి పాటిస్తే.. టీచర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips
☛ TET/DSC 2023: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..
☛ TS TET 2023 Notification : డీఎస్సీపై క్లారిటీ..!
☛ TS TET 2023: టెట్ షెడ్యూల్... పరీక్ష విధానం.. అర్హత మార్కులు ఇలా..
☛ చదవండి: టెట్ - సిలబస్ | డీఎస్సీ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | 2022 ప్రివియస్ పేపర్స్
☛ TS TET 2022 Paper-1 Question Paper & Key
☛ TS TET 2022 Paper-2 Final Key: టీఎస్ టెట్ పేపర్-2 ఫైనల్ 'కీ' విడుదల.. ఈ సారి మాత్రం..